ర‌జ‌నీ చిత్రం   కాలా  రిలీజ్ డేట్‌

Published On: February 8, 2018   |   Posted By:

ర‌జ‌నీ చిత్రం   కాలా  రిలీజ్ డేట్‌

సూప‌ర్‌స్టార్ ర‌జ‌నీకాంత్ టైటిల్ పాత్ర‌లో న‌టిస్తున్న `కాలా`. వండ‌ర్ బార్స్ సంస్థ అధినేత అయిన హీరో ధ‌నుష్ నిర్మిస్తున్న ఈ సినిమాకు లైకా ప్రొడ‌క్ష‌న్స్ కూడా వ‌న్ ఆఫ్ ది పార్ట్‌న‌ర్‌గా వ్య‌వ‌హ‌రిస్తుంది. ముంభై నేప‌థ్యంలో సాగే ఈ సినిమాలో హ్యుమా ఖురేషి, నానా ప‌టేక‌ర్‌, స‌ముద్ర‌ఖ‌ని త‌దిత‌రులు న‌టిస్తున్నారు. ర‌జనీకాంత్‌తో `క‌బాలి` సినిమాను డైరెక్ట్ చేసిన ద‌ర్శ‌కుడు పా రంజిత్ ఈ సినిమాను తెర‌కెక్కిస్తుండ‌టం విశేషం.  కోలీవుడ్ స‌మాచారం ప్ర‌కారం ఈ చిత్రం ఏప్రిల్ 14న విడుద‌ల కానుంద‌ట‌. మ‌రి ర‌జ‌నీకాంత్ `2.0` ఏమైంద‌నే సందేహం రావ‌చ్చు. అస‌లు విష‌య‌మేమంటే.. వి.ఎఫ్‌.ఎక్స్ వ‌ర్క్ కార‌ణంగా `2.0` ఆగ‌స్టులో విడుద‌ల‌య్యే అవ‌కాశాలే ఎక్కువ‌గా క‌న‌ప‌డ‌తుండ‌టంతో `కాలా`ను ముందుగా విడుద‌ల చేయాల‌నుకుంటున్నార‌ట నిర్మాత‌లు.