ర‌వితేజ‌తో   శ్రీనువైట్ల మూడోసారి

Published On: September 18, 2017   |   Posted By:
ర‌వితేజ‌తో   శ్రీనువైట్ల మూడోసారి
ర‌వితేజ‌తో   శ్రీనువైట్ల మూడోసారి.మాస్ మ‌హారాజా ర‌వితేజ‌, శ్రీనువైట్ల కాంబినేష‌న్‌లో మ‌రో సినిమా రూపొంద‌నుంద‌ని వార్త‌లు విన‌ప‌డుతున్నాయి. ఈ సినిమాకు సంబంధించి ఏదో ఒక న్యూస్ బ‌య‌ట‌కు వ‌స్తూనే ఉంది. తాజా స‌మాచారం ప్ర‌కారం ఈ సినిమాలో ర‌వితేజ స‌ర‌స‌న కాజ‌ల్ అగ‌ర్వాల్ పేరుని హీరోయిన్‌గా ప‌రిశీలిస్తున్నారు. వెంకీ, దుబాయ్ శీను చిత్రాలు త‌ర్వాత ర‌వితేజ‌, శ్రీనువైట్ల కాంబినేష‌న్‌లో రూపొందే హ్యాట్రిక్ చిత్ర‌మ‌వుతుంది. అలాగే వీర‌, సారొచ్చారు చిత్రాల త‌ర్వాత ర‌వితేజ‌, కాజ‌ల్ కాంబినేష‌న్‌లో రూపొందే హ్యాట్రిక్ మూవీ కూడా ఇదే కానుండ‌టం విశేషం. వెంకీ, దుబాయ్ శీను చిత్రాల‌ను అవుటండ్ అవుట్ క‌మ‌ర్షియ‌ల్ ఎంట‌ర్‌టైన‌ర్స్‌గా తెర‌కెక్కించిన శ్రీనువైట్ల‌కు గ‌త కొంత‌కాలంగా మంచి హిట్ ల‌భించ‌లేదు. ఈసారి ఎలాగైనా హిట్ కొట్టాల‌నే క‌సితో త‌న‌కు అచ్చొచ్చిన హీరో ర‌వితేజ‌తో సినిమా చేస్తున్నాడు శ్రీనువైట్ల‌.