ర‌వితేజ కొత్త క్యారెక్ట‌ర్‌

Published On: January 11, 2018   |   Posted By:
ర‌వితేజ కొత్త క్యారెక్ట‌ర్‌
గతేడాది ‘రాజా ది గ్రేట్’ చిత్రంతో సక్సెస్‌ను తన ఖాతాలో వేసుకున్నారు రవితేజ. ప్రస్తుతం కల్యాణ్ కృష్ణ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా తర్వాత శ్రీనువైట్ల దర్శకత్వంలో రవితేజ సినిమా చేయబోతున్నారు. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం శ్రీనువైట్ల దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రంలో రవితేజ ఎన్నారై యువకుడిగా కనిపిస్తారట. కుటుంబ కథా చిత్రంగా తెరకెక్కనున్న ఈ సినిమాలో 90 శాతాన్ని యు.ఎస్‌లో చిత్రీకరిస్తారు. ఈ స్క్రిప్ట్‌కు తుది మెరుగులు దిద్దుతున్నారు దర్శకుడు శ్రీనువైట్ల. గతంలో రవితేజ, శ్రీనువైట్ల కాంబినేషన్‌లో ‘నీకోసం’, ‘వెంకీ’, ‘దుబాయ్ శీను’ చిత్రాలు ప్రేక్షకులను మెప్పించాయి.