ర‌వితేజ చిత్రానికి డేట్ ఫిక్స‌య్యింది

Published On: February 10, 2018   |   Posted By:
ర‌వితేజ చిత్రానికి డేట్ ఫిక్స‌య్యింది
కొంతకాలం స్తబ్దుగా ఉన్న కెరీర్ ని ‘రాజా ది గ్రేట్’ ఫ‌లితం ఇచ్చిన ఉత్సాహంతో మళ్ళీ పరుగులు పెట్టిస్తున్నారు మాస్ మహారాజా రవితేజ. ప్ర‌స్తుతం వరుస సినిమాలతో దూసుకుపోతున్నారు. ఇప్ప‌టికే కళ్యాణ్ కృష్ణ దర్శకత్వంలో ‘నేల టికెట్’ సినిమాలో రవితేజ నటిస్తున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం వైజాగ్ లో  రెండో షెడ్యూల్ శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటున్న ఈ చిత్రాన్ని ఏప్రిల్ కల్లా పూర్తిచేయనున్నారు.
ఇదిలా వుంటే, శ్రీనువైట్ల డైరెక్షన్లో కూడా నటించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారు ఈ హీరో. అమెరికా నేపథ్యంగా సాగే ఈ చిత్రాన్ని ఫిబ్రవరి 19న ప్రారంభించనున్నట్టు తెలుస్తోంది. రవితేజ ఏప్రిల్ తర్వాత ఈ సినిమా షూటింగ్లో పాల్గొన‌నున్నారని ఇన్‌సైడ్ సోర్స్ టాక్. రవితేజ మూడు భిన్నమైన పాత్రల్లో నటిస్తున్న ఈ మూవీలో ముగ్గురు కథానాయికలకు అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది.  అలాగే మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి ‘అమర్ అక్బర్ ఆంటోనీ’ పేరుని పరిశీలిస్తున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి.