లండ‌న్ బాబులు సినిమా రిలీజ్ డేట్ ఫిక్స్

Published On: November 8, 2017   |   Posted By:
లండ‌న్ బాబులు సినిమా రిలీజ్ డేట్ ఫిక్స్
వీసా గురించి కుర్రాళ్లు ప‌డే తిప్ప‌ల‌తో తెర‌కెక్కిన సినిమా `లండ‌న్ బాబులు`. స్వాతి హీరోయిన్‌గా న‌టించిన ఈ సినిమా రిలీజ్ డేట్ ఫిక్స్ అయింది. ఈ నెల 17న విడుద‌ల చేయ‌డానికి స‌ర్వ‌స‌న్నాహాలు చేస్తున్నారు. `స్వీట్ మ్యాజిక్‌` ర‌క్షిత్ హీరోగా న‌టిస్తున్న సినిమా ఇది. చిన్నికృష్ణ ద‌ర్శ‌కుడు. మారుతి నిర్మాత‌. మారుతి టాకీస్ ప‌తాకంపై రూపొందుతోంది. మారుతి మాట్లాడుతూ “ఆండ‌వ‌న్ క‌ట్ట‌ళై అనే త‌మిళ సినిమాను స్వీట్ మ్యాజిక్ ప్ర‌సాద్‌గారు చూసి, న‌న్ను చూడ‌మ‌న్నారు. ఫ‌క్తు క‌మ‌ర్షియ‌ల్ సినిమా అని అనుకున్నా. కానీ విజ‌య్ సేతుప‌తి చాలా ప్యాష‌న్‌తో చేశార‌ని ఆయ‌న‌తో మాట్లాడితే తెలిసింది. ప్ర‌సాద్‌గారి జెన్యూనిటీ న‌చ్చింది. ర‌క్షిత్‌కి చాలా మంచి సినిమా అవుతుంది. వీసా కోసం కోసం ప‌డే తిప్ప‌ల్ని గురించి చెప్పాం. స్వాతి ఇందులో నాయిక‌గా న‌టించింది. చాలా చ‌క్క‌గా చేసింది. ఆమె కెరీర్‌లో మ‌రో హిట్ సినిమా అవుతుంది“ అని తెలిపారు.
ఆలీ, ముర‌ళిశ‌ర్మ‌, రాజార‌వీంద్ర‌, జీవా, ధ‌న‌రాజ్‌, స‌త్య‌, అజ‌య్ ఘోష్, ఈరోజోల్లో సాయి, వేణు, స‌త్య‌కృష్ణ త‌దిత‌రులు న‌టించిన ఈ చిత్రానికి
సినిమాటోగ్రాఫర్ – శ్యామ్ కె నాయుడు, మ్యూజిక్ – కె, ఎడిటర్  – ఎస్.బి.ఉద్దవ్, కో డైరెక్టర్ – కొప్పినీడి పుల్లారావు, ఆర్ట్ డైరెక్టర్ – విఠల్ కోసనం. ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ – కిరణ్ తలసిల, దాసరి వెంకట సతీష్.