లాంప్ మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల

Published On: September 25, 2021   |   Posted By:

లాంప్ మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల

 

లాంప్  మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్ ను విడుదల చేసిన యండమూరి వీరేంద్రనాథ్                                                                                                                        
                                                                                                                           

నువ్వుల వినోద్, కోటి కిరణ్, మధుప్రియ, అవంతిక హీరో హీరోయిన్లుగా చరిత సినిమా ఆర్ట్స్ బ్యానర్ పై రాజశేఖర్ దర్శకుడిగా ఏడుచేపలకథ చిత్ర నిర్మాత జి వి యన్ శేఖర్ రెడ్డి నిర్మించిన “లాంప్ ” మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్ ను ప్రపంచ ప్రఖ్యాత నవలా రచయత డాక్టర్ యండమూరి వీరేంద్రనాథ్ విడుదల చేసారు.  

 

 ఈ సందర్భంగా యండమూరి వీరేంద్రనాథ్ మాట్లాడుతూ … లాంప్ మూవీ కథ తెలుసు డైరెక్టర్ రాజశేఖర్  నాకు స్టోరీ చెప్పినప్పుడు చాలా ఎక్సయిటింగ్ గా ఫీల్ అయ్యా అంతర్లీనంగా మంచి మెసేజ్ కూడా ఉంది , ఏడుచేపలకథ చిత్ర నిర్మాత ఈ సినిమాను ఎక్కడ  కంప్రమైస్ కాకుండా నిర్మించి ఉంటారు ప్రేక్షకులు కూడా  ఈ సినిమా ని బాగా ఆదరించాలని ఈ చిత్రంలో నటించిన నటీనటులకు సాంకేతిక నిపుణలకు మంచిపేరు రావాలని అన్నారు .

 

నిర్మాత జి వి యన్ శేఖర్ రెడ్డి మాట్లాడుతూ … ఏడుచేపలకథ లాంటి హిట్ సినిమా తర్వాత ఎలాంటి మూవీ చేద్దామని ఆలోచిస్తున్న టైములో రాజశేఖర్ లాంప్ మూవీ కథ చెప్పాడు నాకు బాగా నచ్చి చేశాను సినిమా బాగా వచ్చింది అన్ని వర్గాల ప్రేక్షలకు నచ్చుతుందని ఆశిస్తున్నా అన్నారు.  

 

దర్శకుడు రాజశేఖర్ మాట్లాడుతూ … ఈ మూవీ సస్పెన్స్ థ్రిల్లర్ తో పాటూ ఒక చిన్న మెసేజ్ అందర్నీ అలరిస్తుంది

 

ఇంకా రాకేష్ మాస్టర్, సి హెచ్ నాగేంద్ర, వై వి రావ్ , చలపతి నటిస్తున్న ఈ చిత్రానికి కెమెరా : క్రిష్ బొంగొని , ఎడిటింగ్ : గణేష్ దాసరి , మ్యూజిక్ : శ్రీ వెంకట్ , నిర్మాత :  జి వి యన్ శేఖర్ రెడ్డి, కథ స్క్రీన్ ప్లే  దర్శకత్వం : రాజశేఖర్.