లైకాతో చేతులు కలిపిన మహేష్ బాబు

Published On: July 25, 2017   |   Posted By:

లైకాతో చేతులు కలిపిన మహేష్ బాబు

ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో ప్రీ-రిలీజ్ బిజినెస్ తో అదరగొడుతోంది స్పైడర్ సినిమా. మహేష్ బాబు నటించిన ఈ సినిమా తెలుగు రాష్ట్రాల్లో భారీ స్థాయిలో ప్రీ-రిలీజ్ చేయడం కొత్త కాదు. కానీ కోలీవుడ్ లో కూడా ఈ సినిమా అదిరిపోయే రేంజ్  లో బిజినెస్ చేయడం మాత్రం చెప్పుకోదగ్గ విశేషమే.

స్పైడర్ సినిమాతో కోలీవుడ్ లో కూడా స్ట్రయిట్ ఎంట్రీ ఇస్తున్నాడు మహేష్ బాబు. మురుగదాస్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాను ఒకేసారి తెలుగు-తమిళ భాషల్లో నిర్మిస్తున్న విషయం తెలిసిందే. తాజాగా తమిళ వెర్షన్ కు సంబంధించి డబ్బింగ్ కూడా పూర్తిచేశాడు ప్రిన్స్. ఇప్పుడీ సినిమా తమిళ థియేట్రికల్ రైట్స్ ను లైకా ప్రొడక్షన్స్ సంస్థ దక్కించుకుంది. ప్రస్తుతం ఈ సంస్థ.. రజనీకాంత్ హీరోగా భారతదేశంలోనే అత్యంత భారీ బడ్జెట్ చిత్రంగా 2.0  సినిమాను
నిర్మిస్తోంది.

మహేష్-మురుగదాస్ కాంబోలో  తెరకెక్కుతున్న ఈ సినిమాను తమిళనాడు అంతటా లైకా ప్రొడక్షన్స్ రిలీజ్ చేయబోతోంది. మురుగదాస్ కు భారీ క్రేజ్ ఉండడంతో కోలీవుడ్ లో ఈ సినిమా సేఫ్ వెంచర్ గా మారుతుందని అంచనా వేస్తున్నారు. రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో ఎస్ జే సూర్య విలన్ గా కనిపించబోతున్నాడు.