లై మూవీ రివ్యూ

Published On: August 11, 2017   |   Posted By:

లై మూవీ రివ్యూ

నటీనటులు – నితిన్, అర్జున్, శ్రీరామ్, మేఘా ఆకాష్, రవికిషన్, మధు

సినిమాటోగ్రఫీ – యువరాజు

సంగీతం – మణిశర్మ

నిర్మాతలు – రామ్ ఆచంట, గోపీ ఆచంట, అనీల్ సుంకర

బ్యానర్ – 14 రీల్స్

కథ, స్క్రీన్ ప్లే, దర్శకుడు – హను రాఘవపూడి

Rating:-2.75/5

సినిమాకు లాజిక్ లు అవసరం లేదు. ప్రేక్షకుడ్ని ఎక్సయిట్ చేస్తే చాలు. థ్రిల్ కు గురిచేస్తే చాలు. ఊహించని ట్విస్టులు అందిస్తే చాలు. సరిగ్గా ఇదే ఫీలింగ్ లో ఉన్నట్టున్నాడు దర్శకుడు హను రాఘవపూడి. అందుకే ఇంతకుముందు తను తీసిన కృష్ణగాడి వీరప్రేమగాథ జానర్ లోనే మరో కథ రాసుకున్నాడు.  ఆ కథకు భారీతనం జోడించాడు. మంచి ఆర్టిస్టుల్ని తీసుకున్నాడు. అదే లై సినిమా. ఈరోజు థియేటర్లలోకి వచ్చింది ఈ మూవీ.

నితిన్-మేఘా ఆకాష్ హీరోయిన్లుగా నటించిన సినిమా సగటు తెలుగు మూవీ స్టయిల్ లోనే రొటీన్ గా స్టార్ట్ అయింది. హీరోయిన్ పరిచయం, హీరో పరిచయం, విలన్ ఎంట్రీ ఇలా సాగిపోతుంది. కానీ ఇంటర్వెల్ కు వచ్చేసరికి ట్విస్ట్ అదిరిపోతుంది. ఓ సూట్ చుట్టూ తిరిగే కథతో తెరకెక్కింది లై సినిమా. ఆర్మీ చీఫ్ వేలిముద్రలు ఉంటాయి దాని మీద. ఆ వేలిముద్రల్ని సంగ్రహించగలిగితే ఏకంగా అణు రియాక్టర్లు, అణ్వాయుధాల్నే ఆపరేట్ చేయొచ్చు. ఈ లైన్ పై ‘లై’ కథను అల్లుకున్నాడు దర్శకుడు హను. సూటును దక్కించుకోవడం కోసం హీరో-విలన్ మధ్య జరిగే మైండ్ గేమే సినిమాకు ప్రధానం.

ఈ కథకు నితిన్ ను తీసుకోవడం అనేది యాధృచ్ఛితకమే కావొచ్చు. కానీ అర్జున్ ను తీసుకోవడం మాత్రం యాక్సిడెంటల్ కాదు. ‘లై’ చూస్తే ఆ విషయం ఎవరికైనా అర్థమౌతుంది. నితిన్ హీరోనే అయినప్పటికీ.. సినిమాకు బ్యాక్ బోన్ గా నిలిచాడు అర్జున్. తన గెటప్స్, యాక్షన్, స్టంట్స్ తో సినిమాను నెక్ట్స్ లెవెల్ కు తీసుకెళ్లాడు. ఇక హీరో విషయానికొస్తే మేకోవర్ తో ఎట్రాక్ట్ చేసిన నితిన్.. యాక్షన్, డాన్స్, డైలాగ్స్ తో మెప్పించాడు. హీరోయిన్ గా పరిచయమైన మేఘా ఆకాష్ కు యావరేజ్ మార్కులు పడతాయి.

టెక్నీషియన్లలో ముందుగా చెప్పుకోవాల్సింది మణిశర్మ గురించే. ఆర్ ఆర్ ఇరగదీశాడు. ఇలాంటి సినిమాలకు రీ-రికార్డింగ్ చాలా కీలకం. లై లాంటి సస్పెన్స్ థ్రిల్లర్ సినిమాలకు మణిశర్మే కరెక్ట్. కాకపోతే సాంగ్స్ లో ఎప్పట్లానే వెనకబడిపోయాడు. బొంబాట్, లగ్గం టైం సాంగ్స్ మినహాయిస్తే మిగతావి పెద్దగా ఆకట్టుకోవు. సినిమాటోగ్రాఫర్ యువరాజ్ వర్క్ బాగుంది.

దర్శకుడి విషయానికొస్తే హను రాఘవపూడి మరోసారి తనకు అలవాటైన స్క్రీన్ ప్లే రాసుకున్నాడు. యాక్షన్ కింగ్ అర్జున్ ను విలన్ గా చూపించడంలో, హీరో నితిన్ ను స్టయిలిష్ గా సరికొత్త మేకోవర్ లో చూపించడంలో సక్సెస్ అయ్యాడు. కాకపోతే స్క్రీన్ ప్లే, డైలాగ్స్, ఎంటర్ టైన్ మెంట్ విషయంలో ఇంకాస్త శ్రద్ధ తీసుకొని ఉంటే లై సినిమా నెక్ట్స్ లెవెల్ లో ఉండేది.

ఇంటర్వెల్ బ్యాంగ్, క్లైమాక్స్, సాంగ్స్, రీరికార్డింగ్ ఈ సినిమాకు ప్లస్ పాయింట్స్. హీరోయిన్, బోర్ కొట్టించే సీన్లు, ఎంటర్ టైన్ మెంట్ లేకపోవడం ఈ సినిమాకు మైనస్ పాయింట్.

ఓవరాల్ గా సస్పెన్స్ థ్రిల్లర్ సినిమాలు కోరుకునే ప్రేక్షకులకు లై సినిమా నచ్చుతుంది.

Movie details:-

Movie title:- LIE

Banner:- 14 Reels Entertainments

Release date:-11.08.2017

Censor rating:-“U/A”

Cast:- Nithin, Megha Aakash, Arjun, Sriram, Pruthvi, Brahmaji, Ravikishan

Story:- Hanu Raghavapudi

Screenplay:- Hanu Raghavapudi

Dialogues:- Hanu Raghavapudi

Directed by:- Hanu Raghavapudi

Music:- Mani Sharma

Cinematography by :-Yuvaraj

Editing:- S R Sekhar

Lyrics penned by :- Krishnakanth.

Dance Choreography:- Raju Sundaram

Producer:- Ram Achanta, Gopi Achanta, Anil Sunkara

Run Time:-150 Minutes

Rating:-2.75/5