ల‌క్ష్మీపార్వ‌తి పాత్ర‌లో కోలీవుడ్ స్టార్‌

Published On: November 14, 2017   |   Posted By:
ల‌క్ష్మీపార్వ‌తి పాత్ర‌లో కోలీవుడ్ స్టార్‌
తెలుగులో బాల‌య్య‌తో `అధినాయ‌కుడు` స‌హా `క‌ళావ‌తి`, కాంచ‌న వంటి ప‌లు అనువాద చిత్రాల్లో న‌టించి మెప్పించిన న‌టి రాయ్ లక్ష్మి. ఇప్పుడు రాయ్‌ల‌క్ష్మి `జూలీ2` చిత్రంతో బాలీవుడ్‌లో అడుగుపెట్ట‌నుంది. ఈ సినిమా న‌వంబ‌ర్ 24న విడుద‌ల‌వుతుంది. అయితే ఇప్పుడు ఈ త‌మిళ హీరోయిన్‌ను ల‌క్ష్మీపార్వ‌తి పాత్ర కోసం కేతిరెడ్డి జ‌గ‌దీశ్వ‌ర‌రెడ్డి అప్రోచ్ అయ్యార‌ని వార్త‌లు విన‌ప‌డుతున్నాయి. స్వ‌ర్గీయ ఎన్టీఆర్ బ‌యోపిక్‌ల సంద‌డి మొద‌లైంది. అందులో భాగంగా ద‌ర్శ‌క నిర్మాత కేతిరెడ్డి జ‌గ‌దీశ్వ‌ర‌రెడ్డి `లక్ష్మీస్ వీర‌గ్రంథం` అనే సినిమాను స్టార్ట్ చేసిన సంగ‌తి తెలిసిందే. ఈ సినిమాలో ల‌క్ష్మీపార్వ‌తిగా న‌టించ‌మ‌ని వాణీ విశ్వ‌నాథ్‌ను కోరారు. అయితే వాణీ విశ్వ‌నాథ్ తిర‌స్క‌రించ‌డంతో ఇప్పుడు కేతిరెడ్డి రాయ్ ల‌క్ష్మీని సంప్ర‌దించిన‌ట్లు స‌మాచారం.