వంద కోట్లు కొట్టిన జై లవకుశ

Published On: September 28, 2017   |   Posted By:
వంద కోట్లు కొట్టిన జై లవకుశ
ఎన్టీఆర్ త్రిపాత్రాభినయం చేసిన జై లవకుశ సినిమా మరో రికార్డు సృష్టించింది. ఈనెల 21న గ్రాండ్ గా విడుదలైన ఈ సినిమా.. రిలీజైన 5 రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా ఏకంగా 100 కోట్ల రూపాయల గ్రాస్ సాధించి అందర్నీ ఆశ్చర్యపరిచింది. ఎన్టీఆర్ మూడు పాత్రల్లో నటించడం, జనతా గ్యారేజ్ లాంటి బ్లాక్ బస్టర్ తర్వాత వచ్చిన సినిమా కావడంతో జై లవకుశపై అంచనాలు పెరిగాయి.
ఆ అంచనాలకు తగ్గట్టే ఈ సినిమాను ప్రపంచవ్యాప్తంగా భారీ స్థాయిలో విడుదల చేశారు. అటు ఓవర్సీస్ లో కూడా 189 లొకేషన్లలో ప్రీమియర్స్ ఏర్పాటుచేశారు. నైజాంలో చాలా చోట్ల రోజుకు 5 షోలు వేశారు. ఇలా అన్నీ కలిసొచ్చి జై లవకుశ సినిమా జస్ట్ 6 రోజుల్లో 100 కోట్ల రూపాయల గ్రాస్ సాధించగలిగింది.
బాబి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాను ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ పై కల్యాణ్ రామ్ నిర్మించాడు. మూవీలో తారక్ సరసన రాశిఖన్నా, నివేత థామస్ హీరోయిన్లుగా నటించారు. దేవిశ్రీప్రసాద్ ఈ సినిమాకు సంగీత దర్శకుడు.