వర్మ నగ్నం మూవీ రివ్యూ

Published On: June 28, 2020   |   Posted By:

వర్మ నగ్నం మూవీ రివ్యూ

ఆశలు భగ్నం(వర్మ ‘నగ్నం’ రివ్యూ)

Rating : 1/5

ఒకప్పుడు  షకీలా నటించిన బి గ్రేడ్ సినిమాల కోసం ఓ వర్గం బ్యాచ్  కాపుకాసుకుని కూచునేవారు. ఊరి చివర ఇలాంటి సినిమాల కోసం థియోటర్స్ ఉండేవి. ఆ సినిమాలతో పోటీపడి రిలీజ్ కి రావాలంటే మళయాళంలో మమ్ముట్టి- మోహన్ లాల్ అంతటి స్టార్లే భయపడేవారు. అయితే కాలక్రమంలో ఆ సినిమాలపై  క్రేజు పడిపోయింది. డైరక్ట్ ఫోర్న్ ఇంటర్నెట్ లో దొరుకుతూంటే  అంత ఖర్చుపెట్టి థియోటర్ కు వచ్చి ఇలాంటి సినిమాలు చూసే జనం తగ్గిపోయారు. డిమాండ్ లేకపోవటంతో సప్పై తగ్గింది. అయితే ఇప్పుడు కరోనా కాటుతో థియోటర్స్ లేవు. కొద్ది మంది ఓటీటిలలో తమ సినిమాలు రిలీజ్ చేస్తున్నారు. అయితే అవీ వర్కవుట్ కావటంలేదు. దాంతో వర్మ ఈ బూతు రూటు ఎంచుకున్నారు. మొన్న క్లైమాక్స్ తీసారు. నాలుగు డబ్బులు వచ్చినట్లున్నాయి. ఇప్పుడు ఇదిగో నగ్నం అంటూ మరోటి మన మీదకు విసిరారు. ఈ చిత్ర రాజం ఏమేరకు సగటు సినీ ప్రేక్షకుడుని ఆకట్టుకుంటుంది. సగటు ప్రేక్షకుడు ఎక్సపెక్ట్ చేసే ఎలిమెంట్స్ ఏమన్నా సినిమాలో ఉన్నాయా వంటి విషయాలు తెలియాలంటే రివ్యూ చదవాల్సిందే.

స్టోరీ లైన్….

భార్య, భర్త మధ్యలో ఓ పనోడు అనే టైటిల్ పెట్టదగ్గ కథ ఇది. భర్త తనను నిర్లక్ష్యం చేస్తున్నాడని భావిస్తున్న శ్రీరాపాక (స్వీటీ) అనుకోకుండా , కొన్ని సంఘటనలతో ఆ ఇంట్లో పనిచేసే పనోడు (జమాల్) కు దగ్గర అవుతాడు.  ఆ అక్రమ సంభందాన్ని అనిర్వచనీయమైన ఆనందంతో వాళ్లిద్దరూ ఎంజాయ్ చేస్తూ ఓ రోజు ఆమె భర్త కళ్లలో పడతారు. ఇంకేముంది..గొడవ. ఆవేశంలో పనోడు..ఆమె భర్తను లేపేస్తాడు. ఆమె ఇప్పుడు ఆ పనోడుని ఇరికించి తను హ్యాపీగా మరో మగాడు కోసం వెతుకులాట మొదలెడుతుంది. ఆ తర్వాత ఏం జరిగిందనే క్వచ్చిన్ లేదు. ఎందుకంటే ఇదే పూర్తి కథ కాబట్టి.

ఎలా ఉంది

కళల ఆవిర్భావం నుంచి శృంగారం వాటిలో ఒక అంశంగా ఉంటూ వచ్చింది. చరిత్రపూర్వం గుహల గోడలపైనే మనుషులు శరీరంలోని మర్మాంగాల చిత్రాలు వేసేవారు. అలాగే సన్నిహితంగా ఉన్న జంటల చిత్రాలను 11 వేల ఏళ్ల క్రితమే చిత్రించారని పరిశోధకులు గుర్తించారు.  భారత్‌లో అదే సమయంలో ‘కామసూత్ర’ కూడా వెలుగులోకి వచ్చింది. కాబట్టి సినిమా అనేది కళ అని భావిస్తాం కాబట్టి అందులో శృంగార చిత్రాలు రావటం తప్పు లేదు కానీ ఆ పేరుతో విచ్చలవిడి తనం మాత్రం చూపెట్టి, మనలో కామోద్రాకాలు కలిగించాలనుకోవటం మాత్రం దారుణమే. అప్పుడు నిషేధింపబడ్డ ఫోర్న్ సైట్స్ లో ఉండే వీడియోలకు ఈ సినిమాలకు తేడా ఏముంటుంది.

‘నగ్నం’ టీజర్  చూసిన వాళ్లంతా ఇది సినిమా టీజరా లేక కండోమ్ యాడా అని కామెంట్లు చేసారు. అయితే టీజర్ నిండా బూతు సీన్లు ఉండటంతో కొందరు కొంతమేరకు ఎక్సపెక్టేషన్స్ పెంచుకున్నారు. దానికి తోడు హీరోయిన్ స్వీటీ అందాలు మామూలుగా ఆరబోయలేదు. ఆమె హావభావాలు కూడా చాలా ఎరోటిగ్గా ఉన్నాయి. ‘నగ్నం’లో  కథ,గిధ అనేవి పెట్టుకోకుండా ఉద్దేశపూర్వకంగా ఈ సినిమాలో బూతును నింపి సేల్ చేసుకునే ప్రయత్నం జరగిన్నట్లుగా ఉంది. ఇంతలా బూతు లోతుల్లోకి దిగిపోయి వర్మ ఇలాంటి సినిమా ఎందుకు చేసిందో ఏమో కానీ ఏదో …ఆ టైపు సినిమా చాలా కాలం తర్వాత రిలీజైంది…చూసి ఎంజాయ్ చేద్దామనుకనే వాళ్లు లాప్ టాప్ ఓపెన్ చేసి సైట్లో కు వెళ్లిపోతున్నారు.

మరి ఈ సినిమా వాళ్ల ఆశని, అంచనాలను కొంతమేరకు అయినా తీర్చగలిగిందా…లేదనే అని చెప్పాలి. కొద్ది నెలల క్రితం చీకటిగదిలో చితక్కొట్టుడు- ఏడు చేపల కథ లాంటి న్యూడ్ కంటెంట్ ఉన్న సినిమాలు థియోటర్స్ లో రిలీజైపోయాయి. బోల్డ్ కంటెంట్ తో ఈ సినిమాలు వేడెక్కించాయన్న టాక్ వినిపించింది. అయితే వర్మ బూతుకి , వాళ్ల బూతుకి తేడా ఉంది. వర్మ వంటి డైరక్టర్ తీసాడంటే…మరీ ఇలాంటి పనోడు..పెళ్లాం…మధ్యలో మొగడు మర్డర్ టైప్ అంత దిగజారుడు ఉంటుందనుకోం. కానీ వర్మకు మన ఎక్సపెక్టేషన్స్ మీద దెబ్బకొట్టడం ప్రతీసారీ అలవాటే. ఈ సారీ అదే చేసారు.

టెక్నికల్ గా…

వర్మ బూతుని కూడా రకరకరాల యాంగిల్స్ లో చూపే ప్రయత్నం చేసాడు. దానికి కెమెరామెన్ సహకరించాడు. అది బూతు అనుకుటారో, కళ అనుకుంటారో మన అభిరుచి మీద ఆధారపడి ఉంటుంది. ఇంతోటి సినిమాకు స్క్రిప్టు ఏమీ లేదు. చిన్న షార్ట్ ఫిల్మ్ లాంటిది ఈ సినిమా.  అడుగు అడుగుకీ బూతుని నింపుతామనే తాపత్రయం తప్ప దర్శకత్వం లో మెరుపులు ఏమీ కనపడవు. దాంతో సినిమాకు పనిచేసిన డిపార్టమెంట్స్ గురించి చెప్పుకోవటానికి కూడా ఏమీ లేకుండా పోయింది.

చూడచ్చా

ఇంత చదివాక…మీరు సినిమా చూడాలనుకుంటున్నారంటే ఆ ట్రైలర్ మిమ్మల్ని ఇంకా వెంటాడుతున్నట్లే..మిమ్మల్ని ఎవరూ ఆపలేరు

నటీనటులు: శ్రీ రాపాక, దీపక్, జమల్ తదితరులు
రచన, దర్శకత్వం : రామ్ గోపాల్ వర్మ
జానర్: ఎరోటిక్ క్రైమ్ థ్రిల్లర్
నిడివి: 22 నిముషాలు
విడుదల తేదీ: 27జూన్,  2020
ప్రొడక్షన్: సౌత్ ప్లస్
రిలీజ్ ప్లాట్ ఫామ్:RGVWorld.in/ShreyasET