వాయిదాపడిన లండన్ బాబులు మూవీ

Published On: November 7, 2017   |   Posted By:
వాయిదాపడిన లండన్ బాబులు మూవీ
వాయిదాపడిన లండన్ బాబులు మూవీ.లెక్కప్రకారం లండన్ బాబులు సినిమా ఈ వీకెండ్ ఎట్రాక్షన్ గా థియేటర్లలోకి రావాలి. కానీ ఆ మూవీని వాయిదావేస్తున్నట్టు మేకర్స్ ప్రకటించారు. అనుకున్న స్థాయిలో థియేటర్లు దొరక్కపోవడంతో లండన్ బాబులు సినిమాను పోస్ట్ పోన్ చేస్తున్నట్టు ఆ మూవీ నిర్మాత మారుతి ప్రకటించాడు. ఈ సినిమాతో రక్షిత్ అనే కుర్రాడు హీరోగా పరిచయం అవుతున్నాడు. స్వాతి హీరోయిన్ గా నటిస్తోంది.
మారుతి టాకీస్‌, ఎవిఎస్ స్టూడియోస్‌ సమర్పణలో ప్రముఖ దర్శక‌ుడు మారుతి నిర్మాతగా, చిన్ని కృష్ణ దర్శకుడిగా లండన్ బాబులు చిత్రం తెరకెక్కింది.  త‌మిళం లో విజ‌య్‌ సేతుప‌తి, రితికా సింగ్ క‌ల‌సి నటించిన “ఆండ‌వ‌న్ క‌ట్టాలై”  సినిమాకు ఇది రీమేక్. నేటి యువత ప్రేమకి, పెళ్లికి ఎంత తొందర పడుతున్నారో అంతే తొందర విడాకులు తీసుకోవడంలో కూడా ముందున్నారు. అలాంటి ఓ జంట లండన్ ప్రయాణంలో జరిగిన పరిస్థితులను దర్శకుడు వినోదాత్మకంగా ఎమోషనల్ గా తెరకెక్కించారు.
తెలుగు నేటివిటీకి తగ్గట్టు దర్శకుడు సినిమాలో కొన్ని మార్పులు చేశారు. ట్రయిలర్ కు ఇప్పటికే మంచి రెస్పాన్స్ రావడంతో మూవీపై అంచనాలు పెరిగాయి. త్వరలోనే కొత్త విడుదల తేదీని ప్రకటిస్తామంటున్నాడు నిర్మాత మారుతి.