విజయ్ సినిమా వాయిదాపడింది

Published On: October 19, 2017   |   Posted By:
విజయ్ సినిమా వాయిదాపడింది
ఈసారైనా ఒకేసారి తెలుగు-తమిళ భాషల్లో వద్దామనుకున్నాడు. ఎన్నడూ లేనివిధంగా తెలుగులో కూడా క్రేజ్ క్రియేట్ అవ్వడంతో టాలీవుడ్ మార్కెట్ లోకి ఎంట్రీ ఇద్దామనుకున్నాడు. కానీ విజయ్ ఆశలు గల్లంతయ్యాయి. అదిరింది సినిమా వాయిదాపడింది. రాజా ది గ్రేట్ సినిమాతో పాటు థియేటర్లలోకి రావాల్సిన ఈ మూవీ సెన్సార్ కారణంగా విడుదలకు నోచుకోలేదు.
విజయ్ మూవీ సెన్సార్ పై మొదట్నుంచి అనుమానాలు వ్యక్తం అవుతూనే ఉన్నాయి. చివరికి తమిళ్ లో కూడా ఇది దీపావళి కానుకగా వస్తుందా రాదా అనే అనుమానాలు అందర్లో ఉండేవి. కానీ కిందామీద పడి, ఎలాగోలా తమిళ వెర్షన్ ను మాత్రం రిలీజ్ చేయగలిగారు. కానీ తెలుగు వెర్షన్ సెన్సార్ మాత్రం సకాలంలో పూర్తికాకపోవడంతో సైమల్టేనియస్ రిలీజ్ సాధ్యం కాలేదు.
మరోవైపు ఈ సినిమాకు తమిళనాట మిక్స్ డ్ టాక్ రావడంతో తెలుగు వెర్షన్ పై క్రేజ్ తగ్గిపోయింది. తెలుగులో నార్త్ స్టార్ ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై శరత్ మరార్ ఈ సినిమాను సమర్పిస్తున్నాడు. కాజల్, సమంత హీరోయిన్లుగా నటించిన ఈ మూవీకి రెహ్మాన్ సంగీత దర్శకుడు.