విజ‌య్ దేవ‌ర‌కొండ‌తో మల‌యాళీ భామ‌

Published On: August 16, 2017   |   Posted By:

విజ‌య్ దేవ‌ర‌కొండ‌తో మల‌యాళీ భామ‌

ఎవ‌డే సుబ్ర‌మ‌ణ్యం చిత్రంలో కీల‌క‌పాత్ర‌లో న‌టించిన విజ‌య్ దేవ‌ర‌కొండ త‌ర్వాత హీరోగా న‌టించిన చిత్రం `పెళ్లిచూపులు`. ఈ సినిమా సూప‌ర్ డూప‌ర్ హిట్ కావ‌డంతో విజ‌య్ దేవ‌ర కొండ‌కు మంచి ఇమేజ్ వ‌చ్చింది. త‌ర్వాత విజ‌య్ దేవ‌ర కొండ ద్వారకా సినిమా విడుద‌లైంది. ఈ నెల 25న అర్జున్ రెడ్డి సినిమా విడుద‌ల కానుంది.

ఇప్పుడు విజ‌య్ దేవ‌ర కొండ హీరోగా రూపొందుతున్న చిత్రాల్లో రాహుల్ సంక్రితియాన్ ద‌ర్శ‌క‌త్వంలో ఓ సినిమా తెర‌కెక్కుతోంది. రాహుల్ సంక్రితియాన్ గ‌తంలో ది ఎండ్ అనే సినిమాను తెర‌కెక్కించాడు. ఇప్పుడు ఈ సినిమాలో విజ‌య్ సర‌స‌న ఎవ‌రిని హీరోయిన్‌గా తీసుకుందామ‌ని యూనిట్ వ‌ర్గాలు చాలానే పేర్ల‌నే ప‌రిశీలించారు. తాజా స‌మాచారం ప్ర‌కారం మాళ‌విక‌నాయ‌ర్ హీరోయిన్‌ను తీసుకోవాల‌నుకుంటున్నార‌ట‌. త్వ‌ర‌లోనే అధికార‌కంగా స‌మాచారం వెలువ‌డ‌నుంది. ఎవ‌డే సుబ్ర‌మ‌ణ్యం, క‌ల్యాణ్ వైభోగమే సినిమాల త‌ర్వాత మాళ‌విక నాయ‌ర్ న‌టించే తెలుగు సినిమా ఇదే.