విరించి వర్మ దర్శకత్వంలో నాగచైతన్య

Published On: November 13, 2017   |   Posted By:
విరించి వర్మ దర్శకత్వంలో నాగచైతన్య
ప్రస్తుతం చందు మొండేటి దర్శకత్వంలో సవ్యసాచి సినిమా చేస్తున్నాడు నాగచైతన్య. త్వరలోనే మారుతి దర్శకత్వంలో ఇంకో సినిమా స్టార్ట్ చేయబోతున్నాడు. ఇదిలా ఉండగా.. ఈ రెండు సినిమాలతో పాటు కుదిరితే మూడో సినిమాను కూడా సెట్స్ పైకి తీసుకొచ్చే ఆలోచనలో ఉన్నాడు చైతూ. అన్నీ అనుకున్నట్టు కుదిరితే విరించి వర్మ దర్శకత్వంలో నాగచైతన్య సినిమా ఉంటుంది.
ఉయ్యాల జంపాల, మజ్ను సినిమాలతో హిట్స్ కొట్టిన విరించి వర్మ, తన మూడో ప్రయత్నంగా నాగచైతన్యతో ఈ సినిమా చేయబోతున్నాడు. ఎమ్ ఎల్ కుమార్ చౌదరి ఈ ప్రాజెక్టుకు నిర్మాత. కీర్తి కంబైన్స్, పద్మజ పిక్చర్స్ సంయుక్తంగా ఈ సినిమాను సమర్పిస్తాయి. త్వరలోనే మూవీకి సంబంధించి మరిన్ని వివరాలు తెలుస్తాయి.