వివాదంలో క్రిష్ సినిమా

Published On: February 7, 2018   |   Posted By:

వివాదంలో క్రిష్ సినిమా

టాలీవుడ్ డైరెక్ట‌ర్ జాగ‌ర్ల‌మూడి క్రిష్ ఇప్పుడు బాలీవ‌డ్ మూవీ `మ‌ణిక‌ర్ణిక` సినిమాను తెరకెక్కిస్తోన్న సంగ‌తి విదిత‌మే. స్వాతంత్ర్య స‌మ‌ర యోధురాలు ఝాన్సీ లక్ష్మిభాయ్ జీవిత‌గాథ‌తో  ఈ సినిమా రూపొందుతోంది. ప్ర‌ముఖ ర‌చ‌యిత విజ‌యేంద్ర‌ప్ర‌సాద్ ఈ సినిమాకు క‌థ‌ను అందించారు. ఈ సినిమా ఇప్పుడు వివాదంలో చిక్కుకుంది. వివరాల్లోకెళ్తే..ఝాన్సీ లక్ష్మిభాయ్ జీవిత క‌థ‌ను వ‌క్రిక‌రించారంటూ స్వ‌ర బ్ర‌హ్మణులు ఆరోపిస్తున్నారు. ఈ విష‌యంపై  సర్వ బ్రాహ్మణ మహా సభ అధ్యక్షుడు సురేష్ మిశ్రా రాజస్థాన్ ప్రభుత్వానికి లేఖ రాశారు. బ్రిటీష్ వ్య‌క్తికి, ఝాన్సీ రాణికి మ‌ధ్య ప్రేమ స‌న్నివేశాల‌ను చిత్రీక‌రిస్తున్నార‌ని ఈ లేఖ‌లో పెర్కొనడం గ‌మ‌నార్హం. మ‌రి దీనిపై `మ‌ణిక‌ర్ణిక` టీమ్ ఎలా స్పందిస్తుందో చూడాల్సిందే.