విషపురం అడియో విడుదల

Published On: September 7, 2018   |   Posted By:

విషపురం అడియో విడుదలవిషపురం

మొట్టమొదటి జాంబీస్ ఈనెల 14న రిలీజ్ అవుతుంది.

విషపురం సినిమా అందరూ కలిసి కష్టపడి కలిసి నిర్మించిన విషపురం. ఈ చిత్రాన్ని నిర్మించిన ప్రొడ్యూసర్స్ పాతురి బుచ్చిరెడ్డి, పాతురి మాధవరెడ్డి లకు, దర్శకుడు సందిరి శ్రీనివాస్ లు ఆడియో విడుదల చేసారు.

నిర్మాత బుచ్చిరెడ్డి మాట్లాడుతూ ” సందిరి శ్రీనివాస్ చెప్పిన కథ చేయడానికి ముందు భయపడిన.. ఆయన పట్టుదలతో మమ్మల్ని ఒప్పించి ఈ సినిమా పూర్తి చేశాడు. ఇదే దర్శకుడితో మా తదుపరి చిత్రాన్ని కూడా నిర్మిస్తున్నాం. విషపురం ఈ నెల 14న విడుదల కాబోతోంది కాబట్టి మీరందరూ సినిమా హిట్ చేసి మమ్మల్ని ముందుకు నడిపించాలన్నారు.”

దర్శకుడు సందిరి శ్రీనివాస్ మాట్లాడుతూ ” జాంబీల మీద ఇంతవరకు ఎవరు సినిమా చేయాలేదు. మేము కష్టపడి సినిమా చేయలేదు… ఇష్టపడి చేసాము. మేమంతా కలిసి ఒక కొత్త సినిమా చేసమన్న తృప్తి తో ఉన్నాము. మా నిర్మాతలు ఈ సినిమా తో సంతోషం గా ఉన్నారు.

కెమెరామెన్ కిషన్ గారు మాట్లాడుతూ ” సినిమా బాగా వచ్చింది ఈ సినిమాలో మంచి ప్రేమకథ ఉంది.. కేమెరా పనితనం మీ అందరికీ నచుతుంది.

నిర్మాతలు – పాతూరి బుచ్చిరెడ్డి, పాతూరి మాధవరెడ్డి, దర్శకులు – శ్రీనివాస్ సందరి, సంగీతం – శ్రీ వెంకట్, కెమెరామెన్ – కిషన్ తిప్పరవేని, బ్యాక్రౌండ్ స్కోర్ – రోహిత్ జిల్లా, కో డైరెక్టర్ – శ్రీధర్, కో రైటర్ – గణేష్,

హీరో – ఆయుష్ రామ్, శ్రవణి, ఛత్రపతి షఫీ,
నటులు గౌటి రాజు, సలీమ్, మల్లేశ్ యాదవ్, రవితేజ, రమేష్, యాదవ్, గణేష్, శ్రీరామ్ శ్రీనివాస్ లు పాల్గొన్నారు.