వీకెండ్ రిలీజెస్

Published On: November 8, 2017   |   Posted By:
వీకెండ్ రిలీజెస్
ఈ వీకెండ్ ఏకంగా 5 సినిమాలు థియేటర్లలోకి వస్తున్నాయి.
 
వాటిలో ఒకటి కేరాఫ్ సూర్య. ఈమధ్య కాలంలో సరైన సక్సెస్ లేని సందీప్ కిషన్ ఈ సినిమాతో మరోసారి అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నాడు. మెహ్రీన్ హీరోయిన్ గా నటించిన ఈ సినిమాకు సుశీంద్రన్ దర్శకుడు. గతంలో నా పేరు సూర్య లాంటి కాన్సెప్ట్ బేస్డ్ సినిమా తీసిన దర్శకుడీయన. చక్రి చిగురుపాటి నిర్మించిన ఈ సినిమా ఈ వీకెండ్ ఎట్రాక్షన్ గా థియేటర్లలోకి రానుంది
శుక్రవారం విడుదలకు సిద్ధమైన మరో సినిమా ఒక్కడు మిగిలాడు. మంచు మనోజ్ కూడా సందీప్ కిషన్ లానే ఈ సినిమాపా చాలా హోప్స్ పెట్టుకున్నాడు. ఎందుకంటే ఈ సినిమా విజయం మంచు మనోజ్ కు చాలా అవసరం. అజయ్ ఆండ్రూస్ నూతక్కి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా సీరియస్ మోడ్ లో సాగుతుంది. అనీషా ఆంబ్రోస్ హీరోయిన్ గా
నటించింది. మంచు మనోజ్ ఇందులో రెండు డిఫరెంట్ షేడ్స్ లో కనిపిస్తాడు.
విశాల్ నటించిన డిటెక్టివ్ సినిమా కూడా వీకెండ్ ఎట్రాక్షన్ గా వస్తోంది. తమిళ్ లో ఈ సినిమా ఇప్పటికే హిట్ అయింది. తుప్పరివాలన్ గా అక్కడ రిలీజై సూపర్ సక్సెస్ అయిన ఈ సినిమా డిటెక్టివ్ గా మనముందుకొస్తోంది. మిస్కిన్ డైరక్ట్ చేసిన ఈ సినిమాలో అను ఎమ్మాన్యుయేల్ హీరోయిన్ గా నటించింది. ఇదొక సీరియస్ మిస్టరీ డ్రామా. పాటలుండవు. కథ
మొత్తం ఒక ఫ్లోలో సాగిపోతుంది.
 
విశాల్ సినిమాతో పాటు థియేటర్లలోకొస్తోంది గృహం. చాన్నాళ్ల గ్యాప్ తర్వాత సిద్దార్థ్ నటించిన సినిమా ఇది. ఇది కూడా తమిళ్ లో రిలీజై మంచి సక్సెస్ అయింది. కోలీవుడ్ లో అవల్ పేరిట విడుదలైన ఈ సినిమా గృహంగా మనముందుకొస్తోంది. పూర్తి హారర్ కాన్సెప్ట్ తో తెరకెక్కిన ఈ సినిమాలో ఆండ్రియా హీరోయిన్ గా నటించింది.
 
ఇక ఇప్పటివరకు మనం చెప్పుకున్న సినిమాల కంటే కాస్త ముందే థియేటర్లలోకి వస్తున్నాడు విజయ్. అతడు నటించిన మెర్సల్ సినిమా అదిరింది పేరుతో రేపే (నవంబర్ 9) థియేటర్లలోకి వస్తోంది. ఆట్లీ డైరక్ట్ చేసిన ఈ సినిమాలో విజయ్ సరసన నిత్యామీనన్, కాజల్, సమంత హీరోయిన్లుగా నటించారు. రెహ్మాన్ సంగీత దర్శకుడు. ఈ సినిమా కూడా
తమిళనాట విడుదలై బ్లాక్ బస్టర్ హిట్ సొంతం చేసుకుంది. విజయ్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది.