వెంక‌టేష్‌కి అక్క‌డేం ప‌ని

Published On: November 18, 2017   |   Posted By:

వెంక‌టేష్‌కి అక్క‌డేం ప‌ని

విక్ట‌రీ వెంక‌టేష్ అన‌గానే యాక్ష‌న్, ఇంటెన్స్ సినిమాల‌తో పాటు కంప్లీట్ ఫ్యామిలీ ఎంట‌ర్‌టైన‌ర్ చిత్రాలు కూడా గుర్తొస్తాయి. తాజాగా ఆయ‌న తేజ సినిమాకు గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చారు. ఆయ‌న న‌టించిన `గురు` చిత్రం మార్చిలో విడుద‌లైంది. త‌మిళంలో మాధ‌వ‌న్ న‌టించిన  `ఇరుది సుట్రు` చిత్రానికి రీమేక్ ఇది. ఈ సినిమా త‌ర్వాత వెంక‌టేష్ ఖాళీగా ఉన్నారు. ఇంకే ప‌నుల‌నూ పెట్టుకోలేదు. ఈ గ్యాప్‌లో ఏం చేశారు అని అడిగితే చాలా ఆస‌క్తిక‌ర‌మైన విష‌యాల‌ను చెప్పారు. తాను ర‌మ‌ణ‌మ‌హ‌ర్షి ఆశ్ర‌మాన్ని సంద‌ర్శించిన‌ట్టు తెలిపారు. ఇంత‌కీ అక్క‌డేం ప‌ని?  ఎందుకు వెళ్లారు?  అని అడిగితే “నాకు ర‌మ‌ణ‌మ‌హ‌ర్షి అంటే చాలా ఇష్టం. ఆయ‌న రాసిన పుస్త‌కాలు ఇష్టం. ఈ మ‌ధ్య దొరికిన  గ్యాప్‌లో నేను ర‌మ‌ణ మ‌హ‌ర్షి ఆశ్ర‌మాన్ని చూసొచ్చాను. త‌ర‌చూ వెళ్తుంటాను. అయితే దాని గురించి ఎవ‌రితోనూ పెద్ద‌గా ఎప్పుడూ షేర్ చేసుకోను. నేను జీవితంలో ఏదీ ప్లాన్ చేయ‌ను. వ‌చ్చిందాన్ని వ‌చ్చిన‌ట్టు ఆస్వాదిస్తుంటాను. ఈ మ‌ధ్య కాలంలో కొన్ని ఆస‌క్తిక‌ర‌మైన స్క్రిప్ట్ ల‌ను కూడా విన్నాను. ఈ స్క్రిప్ట్ లు కూడా త్వ‌ర‌లో పైప్‌లైన్‌లోకి రానున్నాయి. తేజ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కించే సినిమా స్క్రిప్ట్ ఇంకా ఫైన‌లైజ్ కాలేదు. ఈ సినిమా ఫైన‌లైజ్ ఓపెనింగ్ జ‌రుపుకుంటే పెద్ద‌గా ఆల‌స్యం ఉండ‌దు. వెంట‌నే సెట్స మీద‌కు తీసుకెళ్తాం“ అని చెప్పారు.