వెంక‌టేష్ కొత్త సినిమా టైటిల్ 

Published On: November 7, 2017   |   Posted By:
వెంక‌టేష్ కొత్త సినిమా టైటిల్ 
విక్టరీ వెంక‌టేష్ హీరోగా ద‌ర్శ‌కుడు తేజ ఓ సినిమాను తెర‌కెక్కించే ప‌నిలో బిజీగా ఉన్నాడు. సురేష్ ప్రొడ‌క్ష‌న్స్ బేన‌ర్‌లో ఈ సినిమా తెర‌కెక్క‌నుంది. ఈ సినిమాకు `ఆటా నాదే వేటా నాదే` అనే టైటిల్‌ను ప‌రిశీలిస్తున్నార‌ట‌. స‌స్పెన్స్ థ్రిల‌ర్ కాన్సెప్ట్‌తో సినిమా సాగుతుంద‌ని విశ్వ‌స‌నీయ వర్గాల స‌మాచారం. ఈ డిసెంబ‌ర్ 13న హీరో వెంక‌టేష్ పుట్టిన‌రోజు సంద‌ర్భంగా సినిమా లాంఛ‌నంగా ప్రారంభం కానుంది. ఈ సినిమాలో నారా రోహిత్ విల‌న్‌గా న‌టిస్తాడ‌ని కూడా వార్త‌లు వ‌స్తున్నాయి. `గురు` సినిమా త‌ర్వాత వెంక‌టేష్ నటించ‌బోయే చిత్ర‌మిదే. అలాగే `నేనే రాజు నేనే మంత్రి` సినిమా త‌ర్వాత తేజ చేస్తున్న సినిమా ఇది.