వెంక‌టేష్ మ‌ల్టీస్టార‌ర్‌

Published On: September 5, 2017   |   Posted By:
వెంక‌టేష్ మ‌ల్టీస్టార‌ర్‌
`గురు` సినిమా త‌ర్వాత విక్ట‌రీ వెంక‌టేష్ వెంట‌నే మ‌రో సినిమాకు గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చేయ‌లేదు. క‌థ‌లు వింటూనే ఉన్నారు. తాజాగా బొమ్మ‌రిల్లు భాస్క‌ర్ ద‌ర్శ‌క‌త్వంలో ఓ చిత్రంలో న‌టించ‌డానికి అంగీక‌రించార‌ని స‌మాచారం. ఆస‌క్తిక‌ర‌మైన విష‌య‌మేమంటే ఈ సినిమా మల్టీస్టార‌ర్ సినిమా.
గ‌తంలో వెంక‌టేష్, మ‌హేష్‌తో క‌లిసి సీత‌మ్మ వాకిట్లో సిరిమ‌ల్లెచెట్టు, రామ్‌తో కలిసి మ‌సాలా, పవ‌న్‌క‌ల్యాణ్‌తో క‌లిసి గోపాల గోపాల చిత్రాల్లో న‌టించారు.
ఇప్పుడు వెంక‌టేష్ క‌లిసి న‌టించ‌బోయే హీరో మ‌రో యువ క‌థానాయ‌కుడు విజ‌య్ దేవ‌ర‌కొండ‌. రీసెంట్‌గా అర్జున్‌రెడ్డితో స‌క్సెస్ అందుకున్న విజ‌య్ దేవ‌ర‌కొండ‌, ఇప్పుడు మ‌ల్టీస్టార‌ర్‌లో న‌టించ‌డానికి గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చిన‌ట్టేన‌ని ఫిలింన‌గ‌ర్ వ‌ర్గాలు అంటున్నాయి. ప్ర‌స్తుతం క‌థ‌కు తుది మెరుగులు దిద్దుతున్నారట‌. ఈ సినిమాను రాక్‌లైన్ వెంక‌టేష్ నిర్మిస్తార‌ట‌.