వేర్ ఇస్ ది వెంకటలక్ష్మి మూవీ రివ్యూ

Published On: March 15, 2019   |   Posted By:

వేర్ ఇస్ ది వెంకటలక్ష్మి మూవీ రివ్యూ

వేర్ ఇస్ కామెడీ…(‘వేర్‌ ఇస్ ద వెంకటలక్ష్మీ’మూవీ రివ్యూ) 

Rating: 2/5

దెయ్యాలే గత కొద్ది కాలంగా చిన్న సినిమాలకు సాయంగా నిలుస్తున్నాయి. వాటి కథలతో కొత్తవాళ్లు దర్శకులుగా ఆఫర్స్ సంపాదిస్తూంటే నిర్మాతలు ఓ రూపాయి సంపాదించుకుంటున్నారు. అయితే ఆ దెయ్యాలు ఇప్పుడు రివర్స్ అవుతున్నాయి. ఆ కథలు బోర్ కొట్టేస్తున్నాయి. అందుకేనేమో దెయ్యం  కథకు ఆ మధ్యకాలంలో వచ్చి ఆగిపోయిన నలుగురు కుర్రాళ్లు ఓ అమ్మాయి టైప్ కథను కలిపితే ఎలా ఉంటుందనే ఆలోచన ఈ కొత్త దర్శకుడుకి వచ్చినట్లుంది. 

వేర్ ఇస్ ద వెంకట్ లక్ష్మి అంటూ రాయ్ లక్ష్మితో రంగంలోకి దూకేసాడు. కామెడీ కోసం ప్రవీణ్ ని, మధునందన్ ని తోడు తెచ్చుకున్నాడు. మరి దెయ్యం భయపెట్టిందా?కామెడీ నవ్వించిందా?ఓవరాల్ గా సినిమా నడుస్తుందా? రివ్యూలో చూద్దాం.

కథేంటి

అవారాగా తిరిగే  చంటి (ప్ర‌వీణ్‌), పండు (మ‌ధునంద‌న్‌) చేసే పనులు వల్ల ఆ ఊళ్లో అందరూ విసిగెత్తిపోయి ఉంటారు. ఈ లోగా వాళ్ల ఊళ్లోకి  వెంక‌ట‌లక్ష్మి (రాయ్‌ లక్ష్మి) టీచర్‌గా వ‌స్తుంది. దాంతో వాళ్ల కాన్సంట్రేషన్ మారుతుంది. ఆమెను ఇంప్రెస్ చేసేయ్యాలని, పెళ్లి చేసుకోవాలని కలలు కంటారు. అందుకోసం ఎంత కష్టం పడటానికైనా సిద్దపడతారు. అయితే ఈలోగా వాళ్లకు ఓ భయంకరమైన విషయం తెలుస్తుంది. ఆమె మనిషి కాదు దెయ్యం అని రివీల్ అవుతుంది. దాంతో భయపడి పారిపోదామనుకుంటారు. కానీ ఆమె వాళ్లను వదిలిపెట్టకుండా ఓ పని అప్పచెప్తుంది. అయితే ఆ పని చాలా కష్టమైంది. అలాగని పారిపోదామంటే వాళ్లను వదిలిపెట్దదని అర్దమవుతుంది. దాంతో వాళ్లకి వేరే దారి లేక వెంకట లక్ష్మి చెప్పినట్లు చేయటానికి సిద్దపడతారు. ఇంతకీ వెంకటలక్ష్మి ఏం పని చెప్పింది ? వెంకటలక్ష్మి ఫ్లాష్ బ్యాక్ ఏమిటి ? ప్రపంచంలో ఎవరూ దొరకనట్లు వాళ్ళ ఇద్దరిని మాత్రమే ఎందుకు ఈ పనికి ఎంచుకుంది ? చివరికి వాళ్లు వెంకటలక్ష్మి చెప్పింది, చేశారా ?   ఈ కథలో గౌరీ (పూజిత పొన్నాడ‌) ఎవ‌రు?  తదిత‌ర విష‌యాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే.

నవ్వులేదూ, భయపెట్టనూ లేదు  బి,సి సెంటర్లలలో ఆడాలని రాసుకున్నట్లున్న ఈ కథ హర్రర్, కామెడీ మిక్సెడ్ గా వచ్చినా దేనికి న్యాయం చెయ్యలేకపోక చాలా చోట్ల బోర్ కొట్టించింది. స్క్రిప్టులో బాగున్నాయనిపించే ట్విస్ట్ లేమీ తెరమీద పండలేదు. ముఖ్యంగా సెకెండ్ హాఫ్ ని  ట్విస్ట్ లుతో  నడిపారు కానీ అవేమీ థ్రిల్ చెయ్యవు. దానికి తోడు తీసేది కామెడీ సినిమాకదా అని సినిమాటెక్ లిబర్టీ తీసుకుని చాలా సీన్స్ లో  లాజిక్స్ వదిలేసారు. ఇక  స్క్రీన్ ప్లే ఎంత నీరసంగా ఉంటుందంటే సినిమా పై ఉన్న కొద్దిపాటి ఇంట్రస్ట్ ని దెబ్బ తీస్తుంది.  ఇక పండు, చంటి, వెంక‌ట‌ల‌క్ష్మిల క‌థ‌కి మధ్యలో  శేఖ‌ర్, గౌరీ అనే పాత్రల ప్రేమ కథ పెట్టారు. అది ఇరికించిన‌ట్టు అనిపిస్తుంది కానీ కథలో కలవదు. చంటి, పండు చేసే అల్ల‌రి ,చిల్లరిగా ఉండి నవ్వు రప్పించదు. విలన్ వీరారెడ్డి (పంక‌జ్ కేస‌రి)పాత్ర మొదట్లో స్ట్రాంగ్ గా అనిపిస్తుంది కానీ రాను రాను డల్ అయ్యిపోతుంది. ఇలా ఏ పాత్ర సరిగా రాసుకోకుండా డైరక్టర్ తెరకెక్కించేయటం దెబ్బకొట్టింది.

 టెక్నికల్ గా వెంక‌ట్ సినిమాటోగ్రఫీ, హ‌రి గౌర పాటలు, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ బాగున్నాయి. కిర‌ణ్ డైలాగులు అక్క‌డ‌క్క‌డా బాగున్నాయి.  కథ,స్క్రీన్ ప్లే మాత్రం బాగోలేదు. డైరక్టర్  కిషోర్ కుమార్ ఈ క‌థ‌ని ఇంట్రస్టింగ్ గా చెప్పలేకపోయారు. నిర్మాణ విలువ‌లు సోసో గా ఉన్నాయి. 

 చూడచ్చా…

మరీ ఏ కాలక్షేపం లేనప్పుడు, బయిట మరీ ఎండలు బాగా ఎక్కువ అనిపించినప్పుడు ఈ సినిమా సాయంతో థియోటర్స్ లో సేద తీరచ్చు.

తెర ముందు..వెనక

న‌టీన‌టులు:

రాయ్ లక్ష్మి‌, రామ్‌ కార్తీక్‌, పూజిత పొన్నాడ‌, మ‌ధునంద‌న్‌, ప్ర‌వీణ్, అన్న‌పూర్ణ‌, పంక‌జ్ కేస‌రి, జ‌బ‌ర్ద‌స్త్ మ‌హేష్, జెమినీ సురేష్ త‌దిత‌రులు.

 క‌థ‌, స్క్రీన్‌ప్లే, మాట‌లు: త‌ట‌వ‌ర్తి కిర‌ణ్ 

సంగీతం: హ‌రి గౌర‌ 

ఛాయాగ్ర‌హ‌ణం: వెంక‌ట్ ఆర్‌.శాఖ‌మూరి 

క‌ళ‌: బ్రమ్మ క‌డ‌లి 

కూర్పు: ఎస్‌.ఆర్‌.శేఖ‌ర్‌ 

నిర్మాత‌లు: ఆనంద్‌రెడ్డి, శ్రీధ‌ర్‌రెడ్డి 

ద‌ర్శ‌క‌త్వం: కిషోర్ కుమార్ 

సంస్థ‌:  ఏబీటీ క్రియేష‌న్స్‌విడుద‌ల‌:

15 మార్చి 2019Attachments area