వేస‌వికి సుమంత్ కొత్త చిత్రం

Published On: January 13, 2018   |   Posted By:
వేస‌వికి సుమంత్ కొత్త చిత్రం
2017లో విడుద‌లైన `మ‌ళ్ళీరావా`తో అక్కినేని క్యాంప్ హీరో సుమంత్‌కు చాలా పెద్ద హిట్ వ‌చ్చింది. చాలా గ్యాప్ త‌ర్వాత సుమంత్ సాధించిన స‌క్సెస్ ఇది. ఓ ర‌కంగా సుమంత్‌కు ఈ స‌క్సెస్ ఊపిరిలూదింది. ఈ  సినిమా విజయం ఇచ్చిన ఉత్సాహంతో తన తదుపరి చిత్రం షూటింగ్‌తో ఫుల్ బిజీగా మారిపోయాడు. త‌న త‌దుప‌రి సినిమాను ప్రేక్ష‌కుల ముందుకు తీసుకురావ‌డానికి వేగ‌వంతంగా పనిచేస్తున్నాడు. సుమంత్ కొత్త సినిమా ప్ర‌స్తుతం వైజాగ్‌లో చిత్రీక‌ర‌ణ‌ను జ‌రుపుకుంటుంది. ఈ షెడ్యూల్‌తో చిత్రీక‌ర‌ణ పూర్త‌వుతుంది.  ఈ సినిమాలో నైట్ షిఫ్ట్ ఉద్యోగం చేసే ఫొటో జ‌ర్న‌లిస్ట్‌గా ఓ డిఫ‌రెంట్‌ పాత్రను పోషిస్తున్నారు సుమంత్. కాగా, ఈ సినిమాని వేస‌వి కానుక‌గా ఏప్రిల్ నెలలో విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు నిర్మాతలు. క్రైమ్ థ్రిల్లర్‌గా రూపుదిద్దుకుంటున్న ఈ చిత్రం ద్వారా అనిల్ కుమార్ దర్శకుడిగా పరిచయమ‌వుతున్నాడు.