వైజ‌యంతీ మూవీస్ ‘మెయిల్‌’… ‘ఆహా’ ఒరిజిన‌ల్‌గా సంక్రాంతి 2021లో విడుద‌ల

Published On: December 31, 2020   |   Posted By:

వైజ‌యంతీ మూవీస్ ‘మెయిల్‌’… ‘ఆహా’ ఒరిజిన‌ల్‌గా సంక్రాంతి 2021లో విడుద‌ల

2020లో తెలుగు ప్రేక్ష‌కుల‌ను ఎంట‌ర్‌టైన్‌మెంట్‌తో అల‌రించిన తెలుగు ఓటీటీ ‘ఆహా’.. రానున్న కొత్త సంవత్సరం 2021కి సరికొత్తగా ఆహ్వానం పలుకుతుంది. అందులో భాగంగా వైజయంతీ మూవీస్ బ్యానర్‌పై ప్రియాంక ద‌త్, స్వ‌ప్న ద‌త్ నిర్మాత‌లుగా డైరెక్ట‌ర్ ఉద‌య్ గుర్రాల ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిన డిఫ‌రెంట్ మూవీ ‘మెయిల్‌’. ఈ చిత్రాన్ని 2021 సంక్రాంతి సందర్భంగా జనవరి 13న విడుదల చేస్తున్నారు.

ఇంటర్నెట్ వచ్చిన కొత్తలో ప్రజలు దాని వాడకం తెలిసీ తెలియక ఎలా ప్రవర్తించారనే కథాంశంతో దర్శకుడు ఉదయ్ గుర్రాల హాస్య భరితంగా, మనసుకు హత్తుకునేలా ‘మెయిల్‌’ను తెర‌కెక్కించారు. బుధ‌వారం మెయిల్ టీజ‌ర్‌ను విడుద‌ల చేశారు. ప్రియ‌ద‌ర్శి ప్ర‌ధాన పాత్ర‌లో న‌టించారు. ఈ టీజ‌ర్‌కు చాలా మంచి రెస్పాన్స్ వ‌స్తుంది.

నటీనటులు:

ప్రియ‌ద‌ర్శి, హ‌ర్షిత్ మాల్గి రెడ్డి, మ‌ణి అగెరుల‌, శ్రీ గౌరీ ప్రియా రెడ్డి, శ్రీకాంత్ పల్లె, రవీందర్ బొమ్మకంటి, అనుషా నేత తదితరులు

సాంకేతిక వర్గం:

దర్శ‌క‌త్వం: ఉద‌య్ గుర్రాల‌
నిర్మాత‌లు: ప‌్రియాంక ద‌త్‌, స్వ‌ప్న ద‌త్‌
సినిమాటోగ్ర‌ఫీ: ఉద‌య్ గుర్రాల‌, శ్యామ్ దుపాటి
మ్యూజిక్‌: స్వీకార్ అగ‌స్తి
ఎడిట‌ర్‌: హ‌రి శంక‌ర్ టి.ఎన్‌