వ‌రుణ్ తేజ్ కొత్త టైటిల్‌

Published On: February 21, 2018   |   Posted By:

వ‌రుణ్ తేజ్ కొత్త టైటిల్‌

ఘాజీ అనే వార్ మూవీతో ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌య‌మైయ్యాడు సంక‌ల్ప్‌. 1971లో ఇండియా, పాకిస్థాన్ మ‌ధ్య జ‌రిగిన యుద్ధ నేప‌థ్యంలో అండ‌ర్‌వాట‌ర్‌లో జ‌రిగిన యుద్ధ క‌థాంశ‌మే ఘాజీ సినిమా. తెలుగు, త‌మిళం, హిందీ భాష‌ల్లో విడుద‌లైన ఈ సినిమాలో రానా ప్ర‌ధాన పాత్ర‌లో న‌టించాడు. సంక‌ల్ప్‌కు ద‌ర్శ‌కుడిగా చాలా మంచి పేరు వ‌చ్చింది. అయితే సంక‌ల్ప్ త‌న నెక్ట్స్ ప్రాజెక్ట్ స్టార్ట్ చేయ‌డానికి స‌మ‌యం తీసుకున్నాడు. ఓ సైంటిఫిక్ థ్రిల్ల‌ర్ కాన్సెప్ట్‌తో సంక‌ల్ప్ త‌న సెకండ్ మూవీని వ‌రుణ్‌తేజ్‌తో తెర‌కెక్కించ‌నున్నాడు. వ‌రుణ్ కెరీర్‌లో భారీ బ‌డ్జెట్ చిత్రంగా రూపొంద‌నున్న  ఈ సినిమాకు `అహం బ్ర‌హ్మాస్మి` అనే టైటిల్ ప‌రిశీల‌న‌లో ఉంది. ఈ సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడ‌క్ష‌న్ ప‌నులు శ‌ర‌వేగంగా జ‌రుగుతున్నాయి.