శర్వానంద్‌తో ఏషియ‌న్ గ్రూప్ యూనిట్‌ సినిమా

Published On: August 5, 2020   |   Posted By:
శర్వానంద్‌తో ఏషియ‌న్ గ్రూప్ యూనిట్‌ సినిమా
 
శర్వానంద్‌తో సినిమా ప్లాన్ చేస్తున్న శ్రీ వేంక‌టేశ్వ‌ర సినిమాస్ ఎల్ఎల్‌పి (ఏషియ‌న్ గ్రూప్ యూనిట్‌)
 
ఇటీవ‌ల హీరో నిఖిల్ 20వ సినిమాని నిర్మించ‌నున్న‌ట్లు శ్రీ వేంక‌టేశ్వ‌ర సినిమాస్ ఎల్ఎల్‌పి (ఏషియ‌న్ గ్రూప్ యూనిట్‌) ప్ర‌క‌టించింది. తాజాగా, హీరో శ‌ర్వానంద్‌తో ఓ సినిమా నిర్మించ‌నున్న‌ట్లు నిర్మాతలు నారాయ‌ణ్ దాస్ కె. నారంగ్, పుస్కూర్ రామ్మోహ‌న్ రావు తెలిపారు.
 
త్వ‌ర‌లో ఈ చిత్రానికి సంబంధించిన డైరెక్ట‌ర్‌, తారాగ‌ణం, సాంకేతిక నిపుణుల వివ‌రాల‌ను ప్ర‌క‌టించ‌నున్నారు.
 
ఒక‌దాని త‌ర్వాత ఒక‌టిగా చిత్రాలు నిర్మించేందుకు శ్రీ వేంక‌టేశ్వ‌ర సినిమాస్ ఎల్ఎల్‌పి ప్లాన్ చేస్తోంది.
 
శ‌ర్వానంద్ ప్ర‌స్తుతం ‘శ్రీ‌కారం’ చిత్రంతో పాటు ఒక తెలుగు-త‌మిళ ద్విభాషా చిత్రాన్ని ఏక కాలంలో చేస్తున్నారు.
 
మ‌రోవైపు నాగ‌చైత‌న్య‌, సాయిప‌ల్ల‌వి జంట‌గా శేఖ‌ర్ క‌మ్ముల ద‌ర్శ‌క‌త్వంలో ‘ల‌వ్ స్టోరి’ అనే రొమాంటిక్ ఎంట‌ర్‌టైన‌ర్‌ను ఏషియన్ సినిమాస్ నిర్మిస్తోంది. దీని షూటింగ్ ముగింపు ద‌శ‌లో ఉంది.