శేఖర్ కమ్ముల దర్శకత్వంలో నాని

Published On: October 20, 2017   |   Posted By:
శేఖర్ కమ్ముల దర్శకత్వంలో నాని
అన్నీ అనుకున్నట్టు జరిగితే త్వరలోనే శేఖర్ కమ్ముల దర్శకత్వంలో ఓ సినిమా చేయబోతున్నాడు నాని. ఫిదాతో బ్లాక్ బస్టర్ కొట్టిన కమ్ముల సెన్సిబుల్ డైరక్టర్ గా పేరుతెచ్చుకున్నాడు. ఇతడి సినిమాల్లో హీరోయిజం కంటే కథ, ఎమోషన్స్ మాత్రమే ఎక్కువగా కనిపిస్తుంటాయి. అటు నాని కూడా అలాంటి వాటికే ఇంపార్టెన్స్ ఇస్తుంటాడు. తనను ఎలివేట్ చేసే కంటే టోటల్ సినిమా బాగుంటే చాలనుకుంటాడు. అందుకే వీళ్లిద్దరికీ సింక్ అయింది.
ఫిదా తర్వాత ఓ స్టోరీలైన్ అనుకున్నాడు కమ్ముల. ఆ లైన్ ను కేవలం నానిని దృష్టిలో పెట్టుకొని రాసుకున్నాడట. నాని డైలాగ్ డెలివరీ, యాక్టింగ్ అంటే తనకు చాలా ఇష్టమని ఇప్పటికే ప్రకటించిన కమ్ముల.. ఆ లైన్ ను నానికి వినిపించాడట. నానికి కూడా లైన్ నచ్చి డెవలప్ చేయమని చెప్పాడట.
వీళ్లిద్దరి కాంబినేషన్ కనుక సెట్ అయితే ఆ ప్రాజెక్టుకు దిల్ రాజే నిర్మాతగా ఉండే ఛాన్స్ ఉంది. అయితే ప్రీ-ప్రొడక్షన్ వర్క్ కోసం కనీసం 6-7 నెలల టైమ్ అయినా తీసుకుంటాడు కమ్ముల. సో.. కమ్ముల-నాని కాంబినేషన్ సెట్స్ పైకి రావాలంటే చాలా టైం పడుతుంది.