శ్రీవల్లీ మూవీ రివ్యూ

Published On: September 15, 2017   |   Posted By:

శ్రీవల్లీ మూవీ రివ్యూ

సినిమా – శ్రీవల్లీ

తారాగణం – రజత్, నేహా హింగే, రాజీవ్ కనకాల, హేమ

నిర్మాణం – రేష్మ ఆర్ట్స్

నిర్మాత – బీవీఎస్ ఎన్ రాజకుమార్

దర్శకుడు – విజయేంద్ర ప్రసాద్

విడుదల తేదీ – 15-09-2017

రేటింగ్ – 2.5/5

ఈమధ్య కాలంలో తెలుగులో కొత్త కథలొస్తున్నాయి. అందులో కొన్ని సక్సెస్ అవుతున్నాయి కూడా. కానీ కథ కొత్తగా ఉన్నప్పటికీ ఆకట్టుకునేలా చెప్పడంలో తడబడితే మాత్రం రిజల్ట్ కాస్త అటుఇటు అయ్యే ప్రమాదముంది. శ్రీవల్లీ సినిమా విషయంలో అదే జరిగింది. ఇంత కొత్త కథను ఇప్పటివరకు తెలుగులోనే కాదు, ఇండియాలోనే చూడలేదంటే నమ్మి తీరాల్సిందే. కానీ స్క్రీన్ ప్లే, కాస్టింగ్ లో చేసిన పొరపాట్ల వల్ల ఈ సినిమా రీచ్ బాగా పడిపోయింది.

కళ్లకు కనిపించని విశ్వాన్ని మనసుతో చూడగలుగుతున్నాం. ప్రోటాన్, న్యూట్రాన్స్ ను చూస్తున్నాం. సృష్టికి మూలమైన కణాన్ని కనిపెట్టాం. మరి మనసును ఎలా చూడడం, మనసులో వైబ్రేషన్స్ ను ఎలా కొలవడం.. సరిగ్గా ఈ ఆలోచన నుంచి పుట్టుకొచ్చిన కథే శ్రీవల్లీ. హీరోయిన్ మనసుపై సైంటిస్ట్ చేసిన ప్రయోగం కారణంగా ఆమెకు గత జన్మ గుర్తుకొస్తుంది. అప్పటి జన్మలో ఆమె ప్రియుడు ఎవరనే విషయం కూడా తెలుస్తోంది. 6వేల కోట్ల రూపాయల ట్రస్ట్ కు సంబంధించి సమస్యల్ని పరిష్కరించేందుకు బ్రెయిన్ మ్యాపింగ్ కు గురైన హీరోయిన్.. తర్వాత ఎలా మారిపోయింది.. ఫైనల్ గా ఏం సాధించింది అనేది ఈ సైన్స్ ఫిక్సన్ కథ.

రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్ ఈ కథను డైరక్ట్ చేశారు. సన్నివేశాల్ని ఎలా పండించాలో కథా రచయితగానే కాకుండా, దర్శకుడిగా కూడా కూడా ఈయనకు బాగా తెలుసు. కానీ సైన్స్ ఫిక్షన్ కథకు కాస్త ఎరోటిక్ థ్రిల్లర్ కూడా జోడించి దర్శకుడు తప్పుచేశాడేమో అనిపించింది. అంతా కొత్తనటీనటులు కావడంతో కాస్త శృంగారం కూడా పండించాలని అనుకున్నారేమో అనిపిస్తుంది.

ఇక నటీనటుల విషయానికొస్తే శ్రీవల్లీ లాంటి బరువైన పాత్రను నేహా హింగేకు అప్పగించారు. తన శక్తికి మించిన పాత్ర అది. చాలా సందర్భాల్లో హీరోయిన్ యాక్టింగ్ పరంగా తడబడింది. కాకపోతే హాట్ సన్నివేశాల్లో మాత్రం తన టాలెంట్ చూపించింది. ఇక హీరోగా నటించిన రజత్ ఓకే అనిపించాడు. కొన్ని సన్నివేశాల్లో ఎక్స్ ప్రెషన్స్ బాగున్నాయి. రాజీవ్ కనకాల, సత్యకృష్ణ, హేమ తమ పాత్రలకు న్యాయం చేశారు.

టెక్నీషియన్లలో ముందుగా చెప్పుకోదగ్గది రాజమౌళి వాయిస్ ఓవర్ గురించే. తండ్రి సినిమాకు రాజమౌళి వాయిస్ ఓవర్ అందించారు. అది సినిమాను ఎలివేట్ చేయడానికి బాగా పనికొచ్చింది. దీని తర్వాత చెప్పుకోదగ్గ అంశం సినిమాటోగ్రఫీ గురించే. రాజశేఖర్ కమెరా పనితనం బాగుంది. ఈ సినిమాకు సంగీతం అందించిన ఎమ్ ఎమ్ శ్రీలేఖ అక్కడక్కడ పాటలతో మెరిపించినా.. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ విషయంలో ఫెయిల్ అయ్యారు.

రాజమౌళి అడిగితే ఇండస్ట్రీలో ఎవరైనా శ్రీవల్లీ ప్రచారానికి వస్తారు. ఇక విజయేంద్ర ప్రసాద్ కోరితే కాస్త స్టార్ వాల్యూ ఉన్న నటీనటులే ఈ సినిమా చేయడానికి ముందుకొస్తారు. కానీ తండ్రికొడుకులు ఇద్దరూ తమ స్టార్ వాల్యూను ఉపయోగించుకోవాలనుకోలేదు. లో-బడ్జెట్ లో మాత్రమే సినిమా చేయాలని నిర్ణయించుకొని, అలానే పూర్తిచేశారు దర్శకుడు విజయేంద్రప్రసాద్. స్టార్ కాస్ట్ లేకపోవడం, పెట్టాల్సిన దగ్గర ఖర్చుపెట్టకపోవడం ఈ సినిమాకు ప్రధాన లోపం.

వీటి తర్వాత చెప్పుకోదగ్గ అంశం స్క్రీన్ ప్లే. ఎంచుకున్న స్టోరీలైన్ బాగున్నప్పటికీ.. ఇలాంటి టిపికల్ స్టోరీని జాగ్రత్తగా ప్రజెంట్ చేయాలి. ఆ ప్రజంటేషన్ విషయంలో దర్శకుడు ఫెయిల్ అయ్యాడు. స్క్రీన్ ప్లే పరంగా చాలా తప్పులున్నాయి. దీనికి తోడు డైలాగ్స్ సరిగా పడకపోవడం, సాంకేతిక బృందం నుంచి సరైన సహకారం అందకపోవడంతో.. శ్రీవల్లీ తేలిపోయింది. సినిమాలో అడుగడుగునా కమర్షియల్ ఎలిమెంట్స్ కనిపిస్తాయి. కానీ వాటిని క్యాష్ చేసుకునే విధానంలో యూనిట్ అంతా ఫెయిల్ అయిందనే విషయం తెరపై కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది.

ఫైనల్ గా.. కొన్ని ఎమోషనల్ సన్నివేశాలు, రాజమౌళి వాయిస్ ఓవర్ మినహా శ్రీవల్లీ పెద్దగా ఆకట్టుకోదు.

Movie title:-Sri Valli

Banner:- Reshma Arts

Release date:-15.09.2017

Censor Rating:-“A”

Cast:- Rajath Varakavi, ,Arahan Khan, Rajeev Kanakala

Story:-V.Vijayendra Prasad

Screenplay:-V.Vijayendra Prasad

Dialogues:-V.Vijayendra Prasad

Directed by:- V.Vijayendra Prasad

Music:-M M Srilekha

Back ground score:- Sri Charan

Lyricists:-Sivasakthi Dutta,Ananth Sriram

Cinematography:- Rajasekhar

Producers:-  Sunitha,Raj Kumar Brindavan

Run Time:-110 minutes