శ‌ర్వానంద్ కోసం మూడోసారి ప్ర‌భాస్‌…

Published On: September 12, 2017   |   Posted By:

శ‌ర్వానంద్ కోసం మూడోసారి ప్ర‌భాస్‌…

శ‌ర్వానంద్, మెహరీన్ జంట‌గా రూపొందుతోన్న చిత్రం `మ‌హానుభావుడు`. మారుతి ద‌ర్శ‌కుడు. యు.వి.క్రియోష‌న్స్ బ్యాన‌ర్ లో వంశీ, ప్ర‌మోద్‌లు సంయుక్తంగా తెర‌కెక్కిస్తున్నఈ చిత్రం  షూటింగ్ ఇటీవలే పూర్తయ్యింది. ప్ర‌స్తుతం నిర్మాణాంత‌ర కార్య‌క్ర‌మాల‌ను జ‌రుపుకుంటోంది.

ఇట‌లీ, ఆస్ట్రియా, క్రోయెషియా లాంటి విదేశాల్లో మ‌రియు పోలాచ్చి, రామోజీ ఫిల్మ్‌సిటి, హైద‌రాబాద్  లోకేష‌న్స్ లో షూటింగ్ జ‌రుపుకుంది.

ఈ సినిమా  సెప్టెంబ‌ర్ 29న విడుద‌ల‌వుతుంది. లెటెస్ట్ స‌మాచారం ప్ర‌కారం ఈ సినిమా పాట‌ల‌ను ప్ర‌భాస్ చేతుల మీదుగా విడుద‌ల చేస్తార‌ట. గ‌తంలో శ‌ర్వానంద్ న‌టించిన రన్ రాజా ర‌న్‌, ఎక్స్‌ప్రెస్ రాజా చిత్రాల ఆడియోల‌ను కూడా ప్ర‌భాసే విడుద‌ల చేశాడు. ఈ రెండు సినిమాలు చాలా పెద్ద హిట్స్ సాధించాయి. ఇప్పుడు శ‌ర్వానంద్ కోసం ప్ర‌భాస్ మూడోసారి అతిథిగా రానున్నాడు. ఈ సినిమా నిర్మాత‌లు యు.వి.క్రియేష‌న్స్ అధినేత‌లు ప్ర‌మోద్‌, వంశీలు కూడా ప్ర‌భాస్‌కు మంచి స్నేహితులే.