శర్వానంద్ రేపటి సూపర్‌స్టార్ – యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్
శర్వానంద్ రేపటి సూపర్‌స్టార్ – యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్
శర్వానంద్ మా ఇంటి హీరో. రన్ రాజా రన్ సినిమాను ఎవరితో చేయాలనుకున్నప్పుడు వంశీ శర్వానంద్ పేరు చెప్పాడు. తన యాట్యిట్యూడ్ బావుంటుందని కూడా చెప్పాడు. తనెప్పుడూ ఎంటర్టైన్మెంట్ క్యారెక్టర్ చేయలేదు కదా అని అంటే, ట్రై చేయండన్నా, నచ్చితే కంటిన్యూ చేద్దాం అన్నాడు. ఆ మాటలకు నేను, వంశీ, ప్రమోద్ సహా అందరం తనకు ఫ్యాన్స్ అయిపోయాం. ఆరోజు నుండి శర్వా, నాకు బ్రదర్ అయిపోయాడని అన్నారు యంగ్ రెబల్‌స్టార్ ప్రభాస్. శర్వానంద్ హీరోగా, మెహరీన్ హీరోయిన్ గా, మారుతి దర్శకత్వంలో యు.వి.క్రియేషన్స్ బ్యానర్ లో వంశీ, ప్రమొద్ లు సంయుక్తంగా తెరకెక్కిస్తున్న చిత్రం `మహనుభావుడు`. ఈ సినిమా ప్రీ రిలీజ్ వేడుక ఆదివారం హైదరాబాద్‌లో జరిగింది. ఈ కార్యక్రమానికి యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఇంకా ప్రభాస్ మాట్లాడుతూ ..మారుతిగారి దర్శకత్వంలో వచ్చిన ప్రమకథాచిత్రమ్ అంటే నాకు చాలా ఇష్టం. అలాగే భలే భలే మగాడివోయ్ సినిమాలో కూడా అద్భుతంగా నవ్వించారు. `ప్రేమకథాచిత్రమ్`, `భలే భలే మగాడివోయ్` సినిమాలకంటే, ఈ సినిమా ఇంకా బావుండాలని కోరుకుంటున్నాను. యూనిట్ అందరూ కాన్ఫిడెంట్‌గా ఉన్నారు. యూనిట్ అంతా చక్కగా కుదిరింది. సినిమా బ్లాక్టస్టర్ అవుతుందని భావిస్తున్నాను. రేపు పొద్దున సూపర్‌స్టార్ శర్వానంద్ అన్నారు.
కథ రాసుకున్న తర్వాత హీరోగా ఎవరైతే బావుంటుందోనని అనుకుంటున్న తరుణంలో శర్వానంద్ హీరోగా చేస్తానని ఒప్పుకోవడమే కాకుండా తన నటనతో పాత్రకు ప్రాణం పోశాడు. శర్వానంద్ విశ్వరూపాన్ని థియేటర్లో చూస్తారు. చాలా అద్భుతంగా చేశాడు. భలే భలే మగాడివోయ్‌లో నానితో ఎంత ఎగ్జయిట్ అయ్యానో అంత కంటే ఎక్కువ ఎగ్జయిట్మెంట్ కలిగింది. ప్రతి టెక్నిషియన్, ఆర్టిస్టులు చక్కగా సపోర్ట్ చేసి సినిమాను నెక్ట్స్ లెవల్‌కు తీసుకెళ్లారు. నేను రాసుకున్న కథకు అందరూ తమ వర్క్‌తో ప్రాణం పోశారు. ఒక టీం వర్క్. సెప్టెంబర్ 29న విడుదలవుతుంది. ఇలాంటి కాన్సెప్ట్స్ అరుదుగా వస్తుంటాయి. ఇలాంటి కాన్సెప్ట్స్ సినిమాలు అరుదుగా వస్తుంటాయి. వచ్చినప్పుడు అసలు మిస్ కాకూడదు. మంచి ప్యామిలీ ఎమోషనల్ మూవీ. ఇలాంటి మంచి సినిమా తీసే అవకాశం ఇచ్చిన యువి క్రియేషన్స్‌కు రుణపడి ఉంటాను. ప్రభాస్‌గారితో ఎప్పటికైనా సినిమా తీస్తాను అన్నారు దర్శకుడు మారుతి.
మన జీవితంలో మనల్ని ప్రేమించేవాళ్లు నలుగురైదుగురు ఉంటారు. కానీ ప్రభాస్ అన్నకు మాత్రం బెస్ట్ ఫ్రెండ్స్ ఓ పాతిక మంది పైనే ఉంటారంటే అర్థం చేసుకోవచ్చు. ఎందుకంటే నేను సినిమాలో మహానుభావుడని అయితే రియల్ లైఫ్‌లో ప్రభాస్ అన్న మహానుభావుడు. నా సినిమా రిలీజ్ టైంలో నాకంటే ఎక్కువ టెన్షన్ పడేది ప్రభాస్ అన్న. పక్కవాడు కూడా పైకి రావాలని కోరుకునే మంచి వ్యక్తి. ఇక సినిమా గురించి చెప్పాలంటే సినిమా బాగా వచ్చింది. సినిమా చూసి అందరూ తప్పకుండా ఎంజాయ్ చేస్తారు. చాలా రోజుల తర్వాత ఈరోజు డైరెక్టర్ నాతో మంచి సీన్ చేయించుకున్నాడురా అని నిద్రపోయిన రోజులెన్నో ఉన్నాయి. అలా సినిమాను చక్కగా డైరెక్ట్ చేసిన మారుతిగారికి థాంక్స్. ఓ గ్రేట్ ఫిలిం చేసే అవకాశం ఇచ్చిన దర్శకుడు, నిర్మాతలకు థాంక్స్ అని అన్నారు హీరో శర్వానంద్.
ఈ కార్యక్రమంలో చిత్ర యూనిట్ సభ్యులు పాల్గొన్నారు.