షార్ట్ గ్యాప్ లో 3 సినిమాల రిలీజ్ డేట్స్ ఫిక్స్

Published On: July 26, 2017   |   Posted By:

షార్ట్ గ్యాప్ లో 3 సినిమాల రిలీజ్ డేట్స్ ఫిక్స్

జస్ట్ 2 రోజుల గ్యాప్ లో 3 సినిమాల విడుదల తేదీలు ఫిక్స్ అయ్యాయి. నాగార్జున, అఖిల్, నాని సినిమాల విడుదల తేదీలు ఖరారయ్యాయి. ఓంకార్ దర్శకత్వంలో రాజుగారి గది-2 సినిమా చేస్తున్నాడు నాగార్జున. ఈ సినిమా విడుదల తేదీని తాజాగా ఫిక్స్ చేశారు. అక్టోబర్ 13న ఈ సినిమా థియేటర్లలోకి రాబోతోంది. ఈ విషయాన్ని నాగార్జున స్వయంగా ప్రకటించాడు. ఇప్పటివరకు చూసిన ఔట్ పుట్ చాలా బాగుందని, అక్టోబర్ 13న సినిమాను విడుదల చేయాలని అనుకుంటున్నట్టు తెలిపాడు.

మరోవైపు నాగార్జున చిన్న కొడుకు అఖిల్ సినిమా రిలీజ్ డేట్ కూడా ఫిక్స్ అయింది. ఈ విషయాన్ని కూడా నాగార్జునే ప్రకటించాడు. విక్రమ్ కుమార్ డైరక్ట్ చేసిన కొన్ని బిట్స్ చూశానని, ఔట్ పుట్ బ్రహ్మాండంగా ఉందని అంటున్నాడు నాగ్. తన ఫేవరెట్ మంత్ డిసెంబర్ లో 22వ తేదీన అఖిల్ సినిమాను విడుదల చేయబోతున్నట్టు నాగార్జున ప్రకటించాడు. ఈ సినిమాకు ఎక్కక ఎక్కడ ఉందో తాారక, జున్ను అనే టైటిల్స్ ను పరిశీలిస్తున్నారు.

మరోవైపు నేచురల్ స్టార్ నాని కూడా తన కొత్త సినిమా విడుదల తేదీని ప్రకటించాడు. వేణుశ్రీరామ్ దర్శకత్వంలో ఎంసీఏ సినిమా చేస్తున్నాడు నాని. దిల్ రాజు బ్యానర్ లో తెరకెక్కుతున్న ఈ సినిమాను డిసెంబర్ 21న విడుదల చేయబోతున్నారు. అంటే అఖిల్, నాని సినిమాలు జస్ట్ 24 గంటల గ్యాప్ లో థియేటర్లలోకి వస్తున్నాయన్నమాట.