సతీష్ వేగేశ్న బర్త్ డే

Published On: August 29, 2017   |   Posted By:

సతీష్ వేగేశ్న బర్త్ డే

హీరో నాగార్జునతో పాటు ఈరోజు (29-08-2017) మరో సినీప్రముఖుడు కూడా పుట్టినరోజు జరుపుకుంటున్నాడు. అతడే దర్శకుడు సతీష్ వేగేశ్న. శతమానంభవతి సినిమాతో లైమ్ లైట్లోకి వచ్చాడు ఈ దర్శకుడు. దిల్ రాజు నిర్మించిన ఈ సినిమా బ్లాక్ బస్టర్ విజయం సాధించడంతో పాటు.. ఏకంగా జాతీయ అవార్డు కూడా అందుకుంది. అప్పట్నుంచి సతీష్ వేగేశ్న పేరు టాలీవుడ్ లో మారుమోగిపోయింది.

ప్రస్తుతం ఈ దర్శకుడు శ్రీనివాసకల్యాణం అనే ప్రాజెక్టు పనిమీద  ఉన్నాడు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై ఈ టైటిల్ కూడా ఫిక్స్ చేశారు. ఈ సినిమాలోనే రామ్ చరణ్ హీరోగా నటించే అవకాశం ఉందంటూ  మొన్నటివరకు వార్తలు వచ్చాయి. అయితే దిల్ రాజు ఆ వార్తల్ని ఖండించాడు. శర్వానంద్ లేదా నానితో ఈ సినిమాను సెట్స్ పైకి తీసుకొచ్చే అవకాశం ఉంది. శతమానం భవతి సినిమాతో హిట్ అందుకున్న సతీష్ వేగేశ్న.. శ్రీనివాస కల్యాణంతో కూడా మరో సక్సెస్ అందుకోవాలని ఆశిస్తూ… అతడికి పుట్టినరోజు శుభాకాంక్షలు అందిస్తోంది బిజినెస్ ఆఫ్ టాలీవుడ్.