సప్తగిరి ఎల్ ఎల్ బి రివ్యూ

Published On: December 7, 2017   |   Posted By:

సప్తగిరి ఎల్ ఎల్ బి రివ్యూ

నటీనటులు – సప్తగిరి, కశిష్ వోరా, సాయికుమార్, శివప్రసాద్, షకలక శంకర్ తదితరులు

మాటలు – పరుచూరి బ్రదర్స్

సంగీతం – విజయ్ బుల్గానిక్

ఫొటోగ్రఫీ – సారంగం

ఎడిటింగ్ – గౌతంరాజు

పాటలు – చంద్రబోస్, కందికొండ

బ్యానర్ – సెల్యూలాయిడ్ సినీమాటిక్ క్రియేషన్స్

నిర్మాత – డా.రవికిరణ్

దర్శకుడు – చరణ్ లక్కాకుల

రన్ టైం – 138 నిమిషాలు

రిలీజ్ డేట్ – డిసెంబర్ 7, 2017

తన పేరునే సినిమా టైటిల్ గా మార్చి సప్తగిరి ఎక్స్ ప్రెస్ సినిమాతో ఎప్పుడో హీరో అయిపోయాడు కమెడియన్ సప్తగిరి. ఇప్పుడీ కమెడియన్ మరోసారి హీరోగా మారి సినిమా చేశాడు. ఈసారి కూడా తన పేరునే టైటిల్ లో పెట్టుకున్నాడు. అలా తెరకెక్కిన సప్తగిరి ఎల్ ఎల్ బి సినిమా ఈరోజు థియేటర్లలోకి వచ్చింది. జాలీ ఎల్ ఎల్ బికి రీమేక్ గా తెరకెక్కిన ఈ సినిమాతో సప్తగిరి ఎలా ఆకట్టుకున్నాడు.. సినిమా రిజల్ట్ ఏంటి.. హేవే లుక్

కథ

చిత్తూరు జిల్లాలో లాయర్ ప్రాక్టీస్ చేసే సప్తగిరి ఎలాగైనా మంచి పేరు, డబ్బు సంపాదించాలనుకుంటాడు. తన బావ సహకారంతో హైదరాబాద్ కు షిఫ్ట్ అవుతాడు. ఎలాంటి కేసు వాదిస్తే పేరొస్తుందా అని ఎదురుచూస్తుంటాడు. ఈ క్రమంలో పేరుమోసిన క్రిమినల్ లాయర్ సాయికుమార్ తో తలపడతాడు సప్తగిరి. ఓ లారీ యాక్సిడెంట్ కేసులో బిచ్చగాళ్లు చనిపోతే.. ఆ కేసు నుంచి దోషుల్ని సక్సెస్ ఫుల్ గా తప్పిస్తాడు సాయికుమార్. క్లోజ్ అయిపోయిన ఆ కేసును తిరిగదోడతాడు సప్తగిరి. పిల్ వేసి మరీ కేసును, సాయికుమార్ ను కెలుకుతాడు.

కట్ చేస్తే.. అసలు సప్తగిరి ఈ కేసునే ఎందుకు సెలక్ట్ చేసుకున్నాడు.. సాయిమార్ ను ఎదుర్కొన్నాడా అనేది సెకెండాఫ్ స్టోరీ. ఈ సినిమాలో ట్విస్ట్ ఏంటంటే.. చనిపోయింది బిచ్చగాళ్లు కాదు.. రైతులు అని నిరూపిస్తాడు సప్తగిరి. ఎరువుల కోసం వచ్చిన రైతులు రాత్రి హోటల్ లో రెస్ట్ తీసుకోవడానికి డబ్బుల్లేక రోడ్డుపైనే విశ్రాంతి తీసుకుంటారు. వాళ్లపై నుంచి లారీ దూసుకెళ్తుంది. ఆ కేసులో చనిపోయింది బిచ్చగాళ్లు కాదు, రైతులని ఓ సాక్షి ద్వారా నిరూపిస్తాడు సప్తగిరి. అలా 2వందల కేసులు గెలిచి తిరుగులేకుండా దూసుకుపోతున్న సాయికుమార్ కు చెక్ పెడతాడు. ఈ ఒక్క కేసుతో రాష్ట్రవ్యాప్తంగా పేరు సంపాదించుకుంటాడు.

ప్లస్ పాయింట్స్

– సప్తగిరి ఎనర్జిటిక్ యాక్షన్

– సాయికుమార్ లుక్స్, డైలాగ్స్

– పరుచూరి డైలాగ్స్

– ఇంటర్వెల్ బ్యాంగ్

– క్లైయిమాక్స్

మైనస్ పాయింట్స్

– రీమేక్ పేరుతో కథను మార్చేయడం

– సప్తగిరికి హెవీ హీరోయిజం చూపించడం

– పాటలు

– బోర్ కొట్టించే ఫస్టాఫ్

– డైరక్షన్ లోపాలు

బిజినెస్ ఆఫ్ టాలీవుడ్ రివ్యూ

హిందీలో హిట్ అయిన జాలీ ఎల్ ఎల్ బికి రీమేక్ ఇది. అయితే ఇది పేరుకు రీమేక్ అయినప్పటికీ తెలుగు నేటివిటీ కోసం దర్శకుడు చరణ్ లక్కాకుల చాలా మార్పులు చేశాడు. కాస్త కామెడీ, ఇంకాస్త కమర్షియల్ టచ్ ఇచ్చే ప్రయత్నం చేస్తూనే.. సప్తగిరిని హీరోగా ఎలివేట్ చేసేందుకు మాస్-మసాలా ఎలిమెంట్స్ బాగానే దట్టించాడు. ఒక దశలో సప్తగిరికి ఇచ్చిన బిల్డప్ చూస్తే కొంతమందికి ముచ్చటేస్తుంది. జాలీ ఎల్ ఎల్ బి సినిమా చూసిన వాళ్లకు ఇదంతా అవసరమా అనిపిస్తుంది.

సప్తగిరి మరోసారి మూవీకి హైలెట్ గా నిలిచాడు. తన ఎనర్జిటిక్ పెర్ఫార్మెన్స్, డాన్స్, డైలాగ్స్, మేనరిజమ్స్ తో ఆకట్టుకున్నాడు. హీరోగా చేసిన మొదటి సినిమాకు రెండో సినిమాకు సప్తగిరిలో చాలా వేరియేషన్స్ కనిపిస్తాయి. మరీ ముఖ్యంగా ఈసారి ఎక్కువగా కామెడీ జోలికి వెళ్లలేదు ఈ అప్ కమింగ్ హీరో. ఆ బాధ్యతను షకలక శంకర్, దువ్వాసి మోహన్ లాంటి ఆర్టిస్టులకు వదిలేశాడు. తను మాత్రం కేవలం హీరో అనే భావనతో వర్క్ చేశాడు.

హీరో తర్వాత చెప్పుకోవాల్సింది సాయికుమార్ గురించే. ఈ సినిమాకు సాయికుమార్ పెద్ద ప్లస్ పాయింట్. అతడి లుక్స్, డైలాగ్ డెలివరీ సినిమాకు ప్లస్ అయ్యాయి. హీరోయిన్ కశిష్, షకలకశంకర్, శివప్రసాద్ తమ పాత్రల మేరకు నటించారు.

సినిమాకు పనిచేసిన వ్యక్తుల విషయానికొస్తే ముందుగా చెప్పుకోవాల్సింది పరుచూరి బ్రదర్స్ గురించే. ఈ సినిమాకు తమ డైలాగ్స్ తో ఆయువుపట్టుగా నిలిచారు పరుచూరి బ్రదర్స్. మరీ ముఖ్యంగా ప్రీ-ఇంటర్వెల్, క్లయిమాక్స్ లోని కోర్టు సీన్స్ లో పరుచూరి డైలాగ్స్ పటాసుల్లా పేలాయి. సారంగం కెమెరా వర్క్, విజయ్ మ్యూజిక్ ఓకే అనిపిస్తాయి. డా.రవికిరణ్ భారీగానే ఖర్చుచేశారు. ఓ పాటను ఏకంగా విదేశాల్లో కూడా తీయడం విశేషం. సప్తగిరి డాన్సులు ఇరగదీశాడు.

సినిమా మొత్తమ్మీద డైరక్షన్ లోపం కొట్టొచ్చినట్టు కనిపించింది. పైగా సంగీత దర్శకుడు, కెమెరామెన్ నుంచి దర్శకుడికి పూర్తిస్థాయిలో సహకారం అందలేదు. ఎడిటింగ్ మాత్రం బాగుంది. ఇంటర్వెల్ బ్యాంగ్, క్లైయిమాక్స్, సప్తగిరి ఎనర్జిటిక్ యాక్షన్ ఈ సినిమాకు ప్లస్ పాయింట్స్.

బాటమ్ లైన్ – ఒరిజినల్ మూవీ చూడనివాళ్లకు “సప్తగిరి” నచ్చుతాడు

రేటింగ్ – 2.5/5