సప్తగిరి ప్రియాంక అగర్వాల్ జంటగా చిత్రం ప్రారంభం

Published On: September 10, 2019   |   Posted By:

సప్తగిరి ప్రియాంక అగర్వాల్ జంటగా చిత్రం ప్రారంభం

ప్రముఖ రచయిత విజయేంద్రప్రసాద్ సమర్పణలో సప్తగిరి హీరోగా  హర్షవర్ధన్ దర్శకత్వంలో రెయిన్బో మీడియా & ఎంటర్టైన్మెంట్ పతాకం పై నిర్మిస్తున్న చిత్రం పూజాకార్యక్రమాలతో ప్రారంభం
 
రెయిన్బో మీడియా & ఎంటర్టైన్మెంట్ బ్యానర్ లో ప్రొడక్షన్ నెంబర్ 1 గా  ప్రముఖ కమెడియన్, హీరో సప్తగిరి, ప్రియాంక అగర్వాల్ జంటగా, కళ్యాణ్ రామ్ “హారేరామ్” ఫెమ్ హర్షవర్ధన్ దర్శకత్వంలో శైలేష్ వసందాని నిర్మిస్తున్న నూతన చిత్రం ఈరోజు కంచి కామాక్షి టెంపుల్ లో పూజాకార్యక్రమాలతో ఘనంగా ప్రారంభమైంది. 
 
ఈ సందర్భంగా నిర్మాత శైలేష్  మాట్లాడుతూ: ఈరోజు కామాక్షి అమ్మ వారి దివేన లతో కంచి లో మా సినిమాని లాంఛనంగా ప్రారంభించాము.వచ్చే నెల నుంచి రెగ్యులర్ షూటింగ్ మొదలుకానుంది. ఇతర నటీనటులు మరియు టెక్నీషియన్స్ విషయాలు త్వరలో వెల్లడిస్తాము అన్నారు.  ఈ కార్యక్రమంలో హీరో సప్తగిరి, విజయేంద్ర ప్రసాద్, డైరెక్టర్ హర్షవర్ధన్,నిర్మాత శైలేష్ తో పాటు తదితర చిత్ర యూనిట్ సభ్యులు పాల్గొన్నారు.
 
 
స్టోరీ,స్క్రీన్ ప్లే: విజయేంద్రప్రసాద్
డైలాగ్స్: అజయ్
సంగీతం: ఎం.ఎం.శ్రీలేఖ
సినిమాటోగ్రఫీ:  సంతోష్ సర్వమణి
సమర్పణ: వి.విజయేంద్రప్రసాద్
నిర్మాత: శైలేష్ వాసందాని
డైరెక్షన్: హర్షవర్ధన్