సమంత చిత్రం విడుదలకు సిద్దం

Published On: March 2, 2021   |   Posted By:
సమంత చిత్రం విడుదలకు సిద్దం
 
శేఖర్ కమ్ముల మొదలుకొని శివ నిర్వాణ వరకు పలువురు సాఫ్ట్వేర్ ఇంజినీర్లు మన తెలుగు సినిమా రంగంలో దర్శకులుగా అసాధారణ విజయాలు అలవోకగా కైవశం చేసుకుంటూ  తెలుగు సినిమా ప్రమాణాలను పెంచడంలో విశేష కృషి చేస్తున్నారు.
 
ఇప్పుడు ఈ జాబితాలో తాజాగా ‘ముఖేష్ కుమార్’ చేరుతున్నాడు.
     
ముఖేష్ కుమార్ మన భారతీయ ముఖ్య భాషలన్నింటితోపాటు ఫ్రెంచ్, అరబిక్ వంటి పలు విదేశీ భాషల్లోనూ ప్రవేశముండడం గమనార్హం. చిన్నప్పటి నుంచి సినిమాలపట్ల అనురక్తి పెంచుకున్న  ముఖేష్   సినిమాల కోసం హైద్రాబాద్ వచ్చేసి, “సమంత” పేరుతో ఓ ఇండిపెండెంట్ ఫిల్మ్ రూపొందించాడు. 
 
 హిప్నాటిజం నేపథ్యంలో  హీరోయిన్ ఓరియంటెడ్ థ్రిల్లర్ గా తెరకెక్కిన “సమంత” చిత్రంలో సిరి కనకన్ టైటిల్ రోల్ పోషించగా, లిరిన్, రమేష్ నీల్ (యాంకర్ రమేష్), చరణ్, శ్రీకాంత్, పృథ్వి కీలక పాత్రలు పోషించారు.
 
ఇప్పటికే పలు ఇండియన్- ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్స్ కి ఎంపికైన ఈ చిత్రం అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని విడుదలకు సిద్దంగా ఉంది. ఆద్యంతం అత్యంత ఆసక్తికర కథనంతో రూపొందిన “సమంత” చిత్రం దర్శకుడిగా తనకు మంచి పేరు తీసుకురావడంతోపాటు ఇందులో నటించిన, పని చేసిన ప్రతి ఒక్కరికీ మంచి గుర్తింపు తీసుకువస్తుందని ముఖేష్ కుమార్ ఆశాభావం వ్యక్తం చేశాడు.
     
ఈ చిత్రానికి సంగీతం: వి.ఆర్.ఎ. ప్రదీప్, ఎడిటింగ్: సాయికుమార్ ఆకుల, కెమెరా: అశోక్ రత్నం, నిర్మాణం: లియో ఫిల్మ్ కంపెనీ, రచన-ఆలోచన-దృశ్యరూపం:
ముఖేష్ కుమార్.