సల్మాన్ విలన్‌గా జ‌గ‌ప‌తిబాబు

Published On: April 16, 2018   |   Posted By:
సల్మాన్ విలన్‌గా జ‌గ‌ప‌తిబాబు
లెజెండ్‌  సినిమా నుండి క్యారెక్ట‌ర్ ఆర్టిస్ట్‌గా మారిన జ‌గ‌ప‌తిబాబు మంచి పాత్ర‌ల్లో ప్రేక్ష‌కుల‌ను అల‌రిస్తున్న సంగ‌తి తెలిసిందే. రీసెంట్‌గా వ‌చ్చిన `రంగ‌స్థ‌లం` సినిమాలో ప్రెసిడెంట్ పాత్ర‌లో న‌టించి ఆక‌ట్టుకున్నాడు. ‘రంగస్థలం’ విజయోత్సవ సభలో తాను ఓ బాలీవుడ్ మూవీలో నటించబోతున్నానని జగపతిబాబు చెప్పిన సంగతి తెలిసిందే. అయితే ఏ హీరోతో చేయబోతున్నాననే సంగతి ఆయన చెప్పలేదు.
కానీ ఇండస్ట్రీలో వినిపిస్తున్న వార్తల ప్రకారం  ప్రభుదేవా దర్శకత్వంలో సల్మాన్ ‘దబాంగ్-3’లో నటించనున్నారు. దీనికి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ ప్రస్తుతం జరుగుతుండగా.. త్వరలోనే సెట్స్ మీదకు వెళ్లనుంది. ఈ నేపథ్యంలో ఇందులో విలన్‌గా జగపతి బాబును ఫైనల్ చేసినట్లు సమాచారం. మరి ఇందులో నిజమెంతో తెలియాలంటే కొద్ది రోజులు ఆగాల్సిందే.