సవారి మూవీ రివ్యూ

Published On: February 8, 2020   |   Posted By:

సవారి మూవీ రివ్యూ

‘సవారీ’ కష్టమే’ –  సవారీ’ మూవీ రివ్యూ
 
Rating:: 1.5/5
 
షార్ట్ ఫిల్మ్ లు డైరక్ట్ చేసి డైరక్ట్ గా సినిమా డైరక్టర్ అయ్యే ట్రెండ్ ఈ మధ్యన ఊపందుకుంది. షార్ట్ ఫిల్మ్ లో టాలెంట్ చూపించినవారిని హీరోలు, నిర్మాతలు సైతం నమ్ముతున్నారు. అయితే అలా వచ్చిన వారి సినిమాలు కూడా చాలా భాగం షార్ట్ ఫిల్మ్ లు లాగే ఉండి నిరాశపరుస్తున్నాయి. పెళ్లి చూపులు డైరక్టర్ తరుణ్ భాస్కర్ లాంటి వాళ్లు తప్పించి సినిమాగా సక్సెస్ సాధించలేకపోతున్నారు. ఈ నేపధ్యంలో  “బంధం రేగడ్” అనే షార్ట్ ఫిలిం తో 2018లో ప్రతిష్టాత్మక “సైమా” బెస్ట్ షార్ట్ ఫిలిం అవార్డు అందుకున్న సాహిత్ మోత్కూరి దర్శకత్వంలో  “సవారి”  చిత్రం తెరకెక్కింది. ఈ చిత్రం ప్రేక్షకులపై సవారి చేసిందా లేదా తనపై సవారి చేయినిచ్చిందా…ఈ షార్ట్ ఫిల్మ్ దర్శకుడు సక్సెస్ అయ్యాడా వంటి విషయాలు రివ్యూలో చూద్దాం.

స్టోరీ లైన్

 హైదరాబాద్ లోని ఒక  స్లమ్ ఏరియాలో ఉండే మిడిల్ క్లాస్ కుర్రాడు రాజు (నందు). అతను బాద్షా అనే పేరు గల గుర్రాన్ని మ్యారేజ్ ఫంక్షన్స్ కు తోలుకుని జీవిస్తూంటాడు. ఓ రోజు  రాజు జీవితంలోకి భాగీ (ప్రియాంక శర్మ) అనే డబ్బున్న అమ్మాయి వస్తుంది. పెళ్లి పీటల మీద నుంచి జంప్ అయి వచ్చిన ఆమె..రాజు దగ్గర ఆశ్రయం పొందుతుంది. ఈ లోగా భాగీ ఎక్స్ బోయ్ ఫ్రెండ్ కు ఆమె ఎక్కడుందో తెలుసి మండిపోతుంది. తనను వదిలేసి ఓ గుర్రం తోలుకునే వాడి దగ్గర ఉండటం ఏంటని అవమానపడి…ఓ విలన్ కు రాజుని కిడ్నాప్ చేయమని కాంటాక్ట్ ఇస్తాడు.

అయితే ఆ విలన్ ఓ క్లారిటీ లేనోడు. మన హీరో రాజుని కిడ్నాప్ చేయబోయి…పొరపాటున రాజు గుర్రం బాద్షా పై ఉన్న ఓ పెళ్ళి కొడుకుని, బాద్షాని ఎత్తుకుపోతాడు. బాద్షా మిస్సవటంతో నందుకు మెంటలెక్కిపోతుంది. దాని కోసం తెగ వెతుకుతాడు.  చివరకు తన బాద్షాని పట్టుకున్న రాజుకు ఓ చేదు నిజం తెలుస్తుంది. అదేమిటంటే…తను ఎంతో ప్రేమగా చూసుకునే బాద్షా(గుర్రం)కు హార్ట్ ప్లాబ్లం ఉందని. సర్జరీకు ఆరు లక్షల ఖర్చు అవుతుందని. దాంతో తన దృష్టిని ఆ డబ్బులు సంపాదించటం పై పెడతాడు.  ఇదంతా చూసిన హీరోయిన్ భాగీకి  అతని దయగల హృదయంపై సానుభూతి ప్రేమ పుడుతుంది. ఓ మంచి సాంగ్ వేసుకుని ప్రేమలో పడి, బాద్షాని సేవ్ చేయటానికి రాజుకు సాయిం చేయాలని ఫిక్స్ అవుతుంది. అందుకోసం ఓ ప్లాన్  వేస్తుంది. అప్పుడు ఏమౌతుంది. ఆ ప్లాన్ ఏమిటి…రాజు, బాగీల ప్రేమ కథ ఏ దిక్కుకు  
 
స్క్రీన్ ప్లే సంగతి

సాధారంగా చిన్న సినిమాలు భాక్సాఫీస్ దగ్గర స్ట్రాంగ్ గా నిలబడాలి, పెద్ద హీరోల సినిమాలకు పోటీ ఇవ్వాలంటే అందులో ఆర్ ఎక్స్ 100 లాగ కొంత షాకింగ్ కంటెంట్ అయినా ఉండాలి లేదా అద్బుతమైన పాటలు, నటీనటులు , అదిరిపోయే కథ ఉండాలి. ఇవేమీ లేకపోతే చిన్న సినిమాలను ఎవరూ పట్టించుకోవటం లేదు. ముఖ్యంగా కొత్త దర్శకులు తమను తాము ప్రూవ్ చేసుకోవాలనే తాపత్రయంలో చేసే సినిమాల్లో స్పష్టత అతి ముఖ్యంగా ఉండాలి. అలాంటి కొన్ని ఈ సినిమాలో మిస్ అయ్యాయి.  

సినిమా ఫస్టాఫ్ …స్లోగా నడుస్తూ సహన పరీక్ష పెడుతూ సాగుతుంది. నందు మంచి ఫెరఫార్మెన్స్ ఇచ్చినా,, ప్రియాంక శర్మ డీసెంట్ గా నటించినా అవేమీ ఆ నేరేషన్ లో హైలెట్ కావు. సెకండాఫ్ …ఫస్టాఫ్ ని మించిపోయింది. అసలు ఈ సినిమాని ఏం కథ చెప్పి నిర్మాతను, హీరోని ఒప్పించారనే సందేహం కలుగుతుంది. తెరపై ఎమోషన్ సీన్స్ వస్తూంటే మనకు నవ్వు వస్తూంటుంది. కామెడీ సీన్స్ …నవ్వు రావు సరికదా…ఏడిపిస్తాయి. డైరక్షన్ అంతంత మాత్రమే. చాలా అప్ అండ్ డౌన్ గా సినిమా నడుస్తుంది. ట్రైలర్ బాగా కట్ చేయటం అనే ఒక్క కారణం వల్ల రిలీజ్ రోజు ఈ సినిమాకి ఓపెనింగ్స్ బెటర్ గా వచ్చాయి.  

టెక్నికల్ గా
నటుడుగా నందు తన విశ్వరూపం చూపించాడనే చెప్పాలి. అయినా ఇలాంటి స్క్రిప్టులలో అదంతా బూడిదలో పోసిన పన్నీరే. ప్రొడక్షన్ వాల్యూస్ సైతం చాలా పూర్ గా ఉన్నాయి. చాలా షార్ట్ ఫిల్మ్ లు ఈ సినిమా కన్నా చాలా బెస్ట్. ఈ సినిమాలో చెప్పుకోదగ్గ ఏదైనా ఉందంటే అది సంగీతం,సినిమాటోగ్రఫీ  మాత్రమే. మిగతా డిపార్టమెంట్స్ అన్నీ సినిమా ఫలితం తెలిసినట్లే బిహేవ్ చేసాయి. ఎడిటర్ అయితే మరీ ఆడేసుకున్నాడు.

చూడచ్చా
బోర్ సినిమాలు చూడటం మీకు హాబీ అయితే ఖచ్చితంగా చూసి తీరాలి.

ఎవరెవరు..
 
నటీన‌టులు: న‌ందు, ప్రియాంక‌శ‌ర్మ‌, శ్రీ‌కాంత్ గంట‌, శివ‌కుమార్‌, మ‌ది త‌దిత‌రులు
సంగీతం: శేఖ‌ర్‌చంద్ర‌
సినిమాటోగ్ర‌ఫీ: మోనిష్ భూప‌తిరాజు
ఎడిటింగ్: స‌ంతోష్ మేన‌మ్‌
క‌థ‌, స్క్రీన్‌ప్లే, మాట‌లు, ద‌ర్శ‌క‌త్వం: సాహిత్ మోత్కూరి
నిర్మాత‌: స‌ంతోష్ మోత్కూరి, నిశాంక్‌రెడ్డి కుడితి
రిలీజ్ డేట్‌: 07-02- 2020