సవ్యసాచి ఫస్ట్ షెడ్యూల్ పూర్తి

Published On: November 18, 2017   |   Posted By:
సవ్యసాచి ఫస్ట్ షెడ్యూల్ పూర్తి
నాగచైతన్య, నిధి అగర్వాల్ హీరోహీరోయిన్లుగా చందు మొండేటి దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా సవ్యసాచి. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై తెరకెక్కుతున్న ఈ సినిమా తాజాగా ఫస్ట్ షెడ్యూల్ పూర్తిచేసుకుంది. ఈ విషయాన్ని హీరోయిన్ నిధి అగర్వాల్ స్వయంగా ప్రకటించింది. సవ్యసాచి ఫస్ట్ షెడ్యూల్ కంప్లీట్ చేసుకుందని ప్రకటించిన నిధి అగర్వాల్.. కార్తికేయ సినిమాక నంది అవార్డు వచ్చిన సందర్భంగా చందు మొండేటికి శుభాకాంక్షలు అందజేసింది. ఈమెకిదే తొలి తెలుగు సినిమా.
సవ్యసాచి సినిమాకు కీరవాణి సంగీతం అందిస్తున్నాడు. ఈ మూవీకి సంబంధించి ఇప్పటికే కొన్ని ట్యూన్స్ ఫైనలైజ్ చేశారు. త్వరలోనే పాటల చిత్రీకరణ ప్రారంభించబోతున్నారు. ఓ డిఫరెంట్ కాన్సెప్ట్ తో యాక్షన్ ఎంటర్ టైనర్ గా రాబోతోంది సవ్యసాచి సినిమా.