సవ్యసాచి మూవీ అప్ డేట్స్

Published On: April 26, 2018   |   Posted By:

సవ్యసాచి మూవీ అప్ డేట్స్

నాగచైతన్య, చందుమొండేటి దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా సవ్యసాచి. డిఫరెంట్ కాన్సెప్ట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమాలో భూమిక, మాధవన్ కీలక పాత్రల్లో కనిపించనున్నారు. నిధి అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తోంది. ఈ మూవీ షూటింగ్ దాదాపు పూర్తయింది. ప్రస్తుతం నాగచైతన్య డబ్బింగ్ చెబుతున్నాడు.

ఈ డబ్బింగ్ కార్యక్రమం పూర్తయిన వెంటనే యూనిట్ మొత్తం అమెరికా వెళ్తుంది. వచ్చేనెల 2 నుంచి 12 వరకు ఈ షెడ్యూల్ ఉంటుంది. దీని తర్వాత హైదరాబాద్ లో మరో 10 రోజులు ప్యాచ్ వర్క్ నడుస్తుంది. దీంతో సవ్యసాచి సినిమా షూటింగ్ మొత్తం కంప్లీట్ అయిపోతుంది. అమెరికా షెడ్యూల్ కంప్లీట్ అయిన వెంటనే సవ్యసాచి టీజర్ ను విడుదల చేయబోతున్నారు. చందు మొండేటి, నాగచైతన్య కాంబినేషన్ లో ఇది రెండో సినిమా. గతంలో వీళ్లిద్దరి కాంబోలో ప్రేమమ్ సినిమా వచ్చింది.