సాయిరాంశంకర్ కు పుట్టినరోజు శుభాకాంక్షలు

Published On: September 13, 2017   |   Posted By:

సాయిరాంశంకర్ కు పుట్టినరోజు శుభాకాంక్షలు

టాలీవుడ్ కు సంబంధించి హీరో సాయిరాంశంకర్ ఈరోజు తన పుట్టినరోజును గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకుంటున్నాడు. తాజాగా ఈ హీరో నటించిన నేనో రకం సినిమా సక్సెస్ సాధించడంతో.. ఈ ఏడాది బర్త్ డే సాయిరాం శంకర్ కు స్పెషల్ గా మారింది. స్టార్ డైరక్టర్ పూరి జగన్నాధ్ సోదరుడిగా ఇండస్ట్రీకి పరిచయం అయిన సాయిరాంశంకర్.. కళ్లముందే నటుడిగా ఎదిగాడు. స్వతహాగా తనకున్న టాలెంట్ కు పూరి సాయం కూడా తోడవ్వడంతో తొందరగానే నటుడిగా పేరుతెచ్చుకున్నాడు.

అదే ఉత్సాహంతో హీరోగా కూడా మారాడు. ఇడియట్, నేనింతే లాంటి సినిమాల్లో చిన్నచిన్న పాత్రలు పోషించిన సాయిరాం శంకర్.. 143 సినిమాతో హీరోగా మారాడు. ఆ సినిమా మంచి విజయాన్ని అందించింది. తర్వాత డ్యూయల్ రోల్ లో హలో ప్రేమిస్తారా అనే సినిమా చేశాడు. ఆ తర్వాత చేసిన బంపర్ ఆఫర్ సినిమా సాయిరాం కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది. ఇందులోని “ఎందుకే రమణమ్మ” అనే పాట ఇప్పటికీ పాపులరే.

వెయ్యి అబద్ధాలు, యమహో యమ, వీడే కావాలి, దిల్లున్నోడు, రోమియో.. ఇలా చాలా సినిమాల్లో హీరోగా నటించాడు సాయిరాం శంకర్. ఇండస్ట్రీలో తనకంటూ ఓ  ఇమేజ్ సంపాదించుకున్న ఈహీరో.. భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, పుట్టినరోజు శుభాకాంక్షలు అందిస్తోంది బిజినెస్ ఆఫ్ టాలీవుడ్.