సాహోలో మ‌రో హీరోయిన్‌?

Published On: September 18, 2017   |   Posted By:
సాహోలో మ‌రో హీరోయిన్‌?
బాహుబ‌లి చిత్రంతో జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్నాడు రెబ‌ల్ స్టార్ ప్ర‌భాస్‌. ప్ర‌స్తుతం ఆయ‌న న‌టిస్తున్న త్రిభాషా చిత్రం సాహో. తెలుగు, హిందీ, త‌మిళ భాష‌ల్లో తెర‌కెక్కుతోందీ సినిమా. భారీ తారాగ‌ణంతో రూపొందుతున్న ఈ సినిమాలో శ్రద్ధా క‌పూర్ హీరోయిన్‌గా న‌టిస్తున్న సంగ‌తి తెలిసిందే. శ్ర‌ద్ధ‌తో పాటు మ‌రో హీరోయిన్ కి కూడా ఈ సినిమాలో చోటుంద‌ని వార్త‌లు వినిపిస్తున్నాయి. ఓ ప్ర‌ముఖ క‌థానాయిక ఆ పాత్ర‌లో సంద‌డి చేయ‌నుంద‌ని స‌మాచారమ్‌.
అయితే అది అతిథి పాత్ర మాత్ర‌మేన‌ని తెలుస్తోంది. మ‌రి ఆ క‌థానాయిక ఎవ‌రో తెలియాలంటే ఇంకొన్నాళ్లు ఆగాల్సిందే. ర‌న్ రాజా ర‌న్ ఫేమ్ సుజిత్ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతున్న సాహో.. వ‌చ్చే ఏడాది ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. బాహుబ‌లి త‌రువాత వ‌స్తున్న చిత్రం కావ‌డంతో ఈ చిత్రంపైన భారీ అంచ‌నాలే ఉన్నాయి.