సాహో ట్రైలర్ బిగ్ స్క్రీన్స్‌పై ప్రదర్శన

Published On: August 10, 2019   |   Posted By:
సాహో ట్రైలర్ బిగ్ స్క్రీన్స్‌పై ప్రదర్శన
 
ప్రభాస్ అభిమానులకు  పండగ..సాహో ట్రైలర్ .. బిగ్ స్క్రీన్స్‌పై ప్రదర్శన
 
సాహో చిత్రం కోసం ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ప్రభాస్ అభిమానులు ఆసక్తిగా వేచి చూస్తున్నారు. ఈ సినిమాపై ఇండియన్ వైడ్‌గా అన్ని ఇండస్ట్రీలలో అంచనాలు భారీగా ఉన్నాయి. ట్రైలర్ కోసం కూడా దేశవ్యాప్తంగా అభిమానులు వేచి చూస్తున్నారు. వీటిని నిలబెట్టుకునే పనిలో యూవీ క్రియేషన్స్ కూడా ముందడుగు వేస్తుంది. ముఖ్యంగా సాహో ట్రైలర్ వేడుకను భారీగా ప్లాన్ చేస్తున్నారు మేకర్స్. అభిమానుల కోసం మరిన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రభాస్ ఫ్యాన్స్ కోసం ప్రత్యేకంగా బిగ్ స్క్రీన్‌పై ట్రైలర్ చూసే అవకాశాన్ని కల్పిస్తున్నారు యూవీ క్రియేషన్స్. ఆగస్ట్ 10న సాహో ట్రైలర్‌ను ఏపీ, తెలంగాణలోని 20 థియేటర్లలో ఆగస్ట్ 10 సాయంత్రం ప్రత్యేకంగా ప్రదర్శించనున్నారు. ప్రభాస్ అభిమానుల సమక్షంలో ఈ వేడుక జరగనుంది. ప్ర‌భాస్ హీరోగా సుజీత్ తెర‌కెక్కిస్తున్న‌యాక్షన్ ఈ ఎంట‌ర్‌టైన‌ర్ ఇప్పటికే సంచలనాలు సృష్టిస్తుంది. ట్రైలర్‌తో సినిమాపై అంచనాలు మరింతగా పెరిగిపోవడం ఖాయం. అందుకే ఈ ట్రైలర్ పండగను మరింత భారీగా ప్లాన్ చేస్తున్నారు. ఈ సంద‌ర్భంగా పోస్ట‌ర్ కూడా విడుద‌ల చేసారు యూనిట్. ఈ సినిమాపై అంచ‌నాలు తారాస్థాయిలో ఉన్నాయి. ఇప్ప‌టికే విడుద‌లైన టీజ‌ర్, మేకింగ్ వీడియోలు, పాట‌లు సినిమాపై మ‌రింత ఆస‌క్తిని పెంచేసాయి. ఇండియాలో ఇప్ప‌టి వ‌ర‌కు చూడ‌న‌టువంటి యాక్ష‌న్ సీన్స్ సాహోలో ఉండ‌బోతున్నాయి. వీటికోస‌మే భారీగా ఖ‌ర్చు చేసారు యూవీ క్రియేష‌న్స్. హాలీవుడ్ టెక్నీషియ‌న్స్ సాహో కోసం ప‌ని చేసారు. దుబాయ్, రుమేనియా లాంటి దేశాల్లో చిత్రీక‌రించిన యాక్ష‌న్ స‌న్నివేశాలు సాహోకు హైలైట్ కానున్నాయి. హాలీవుడ్ యాక్ష‌న్ కొరియోగ్ర‌ఫ‌ర్లు సాహో సినిమా కోసం ప‌ని చేసారు. ప్ర‌భాస్ కూడా ఈ చిత్రం కోసం చాలా క‌ష్ట‌ప‌డ్డాడు. యాక్ష‌న్ సీన్స్ కోసం ప్ర‌త్యేకంగా శిక్ష‌ణ కూడా తీసుకున్నాడు. శ్ర‌ద్ధా క‌పూర్ ఈ సినిమాలో హీరోయిన్. నీల్ నితిన్ ముఖేష్, అరుణ్ విజ‌య్, జాకీ ష్రాఫ్ ఇత‌ర కీల‌క పాత్ర‌ల్లో న‌టిస్తున్నారు. ఆగ‌స్ట్ 30న ప్ర‌పంచ వ్యాప్తంగా సాహో విడుద‌ల కానుంది. భారీ ఖర్చుతో యూవీ క్రియేష‌న్స్ ఈ చిత్రాన్ని నిర్మించింది. ప్ర‌భాస్ అభిమానుల‌కు ఇది పండ‌గ లాంటి సినిమా అని మాటిస్తున్నాడు ద‌ర్శ‌కుడు సుజీత్. 
 
 
న‌టీన‌టులు:
ప్ర‌భాస్, శ్ర‌ద్ధా క‌పూర్, నీల్ నితిన్ ముఖేష్, జాకీ ష్రాఫ్, అరుణ్ విజ‌య్, మందిరా బేడీ త‌దిత‌రులు                                                                        
సాంకేతిక నిపుణులు:
క‌థ‌, స్క్రీన్ ప్లే, ద‌ర్శ‌కుడు: సుజీత్
నిర్మాత‌లు: వ‌ంశీకృష్ణా రెడ్డి, ప్ర‌మోద్ ఉప్ప‌ల‌పాటి, భూష‌ణ్ కుమార్
సంగీతం: త‌నిష్క్ బ‌గేచీ, గురు రంధ్వా
నేప‌థ్య సంగీతం: జిబ్ర‌న్
సినిమాటోగ్ర‌ఫీ: ఆర్ మ‌ది 
ఎడిట‌ర్: ఏ శ్రీక‌ర్ ప్ర‌సాద్
పిఆర్ఓ: ఏలూరు శ్రీను