సిద్ధార్థ్ మ‌ల‌యాళ సినిమా

Published On: January 16, 2018   |   Posted By:
సిద్ధార్థ్ మ‌ల‌యాళ సినిమా
తెలుగు, త‌మిళ ప్రేక్ష‌కుల‌కు సుప‌రిచితుడైన హీరో సిద్ధార్థ్‌. రీసెంట్‌గా తెలుగులో `గృహం` త‌మిళంలో `అవ‌ల్‌`, హిందీలో `ది హౌస్ నెక్ట్స్ డోర్‌` పేరుతో మంచి స‌క్సెస్‌ను సొంతం చేసుకున్నాడు సిద్ధార్థ్‌. ప్ర‌స్తుతం ఓ మ‌ల‌యాళ చిత్రంలో న‌టిస్తున్నాడు. ఆస‌క్తిక‌ర‌మైన విష‌య‌మేమంటే సిద్ధార్థ్ న‌టిస్తున్న తొలి మ‌ల‌యాళ చిత్రమిదే. `క‌మ్మ‌ర సంభ‌వం` అనే పేరుతో ఈ సినిమా రానుంది. ఈ విష‌యాన్ని సిద్ధార్థ్ త‌న ట్విట్ట‌ర్ అకౌంట్ ద్వారా తెలియజేశాడు. ర‌తీశ్ అంబ‌ట్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ చిత్రానికి ముర‌ళీ గోపీ ర‌చ‌యిత‌గా వ‌ర్క్ చేశారు. ఈ సినిమాతో మ‌ల‌యాళంలో సిద్ధార్థ్ ఎలాంటి స‌క్సెస్ అందుకుంటాడో తెలియాలంటే కొన్ని రోజులు ఆగాల్సిందే.