సినిమా షూటింగ్స్ ఆంధ్రప్రదేశ్ లోని గవర్నమెంట్ స్థలాలలో చేసుకోవచ్చు

Published On: June 1, 2020   |   Posted By:

సినిమా షూటింగ్స్ ఆంధ్రప్రదేశ్ లోని గవర్నమెంట్ స్థలాలలో చేసుకోవచ్చు

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి మే 19న విడుదల చేసిన జిఓ ఎమ్ ఎస్ నెంబర్ 45 ప్రకారం సినిమా షూటింగ్స్ ఆంధ్రప్రదేశ్ లోని గవర్నమెంట్ స్థలాలలో చేసుకోవచ్చని తెలిపింది. అందుకు గాను తెలుగు ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ సంతోషం వ్యక్తం చేసింది. సినిమా ఇండస్ట్రీ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి గారికి కృతజ్ఞతలు తెలిపింది.

సినిమా చిత్రీకరణ కు సహకరించిన ఎపి స్టేట్ ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ ఛైర్మెన్ టిఎస్.విజయ్ చందర్ కు తెలుగు ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ ధన్యవాదాలు తెలుపుతుంది. గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ షూటింగ్స్ కు అనుమతి ఇవ్వడమే కాకుండా చిత్రీకరణకు అవసరమైన వసతులు కల్పిస్తున్న కారణంగా  తెలుగు ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ కృతజ్ఞతలు తెలిపింది.

తెలుగు  నిర్మాతలకు స్టూడియోస్ నిర్మించడానికి భూములు ఇవ్వమని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిని తెలుగు ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ కొరబోతోంది.