సినీ కార్మికుల సంక్షేమార్థం సంపత్ నంది విరాళం

Published On: April 3, 2020   |   Posted By:
సినీ కార్మికుల సంక్షేమార్థం సంపత్ నంది విరాళం
 
సినీ కార్మికుల సంక్షేమార్థం 5 లక్షల రూపాయల విరాళం అందిస్తున్న డైరెక్టర్ సంపత్ నంది
 
కరోనా సంక్షోభం వలన సినిమా షూటింగు లు లేక  ఇబ్బందులు ఎదుర్కొంటున్న సినీ కార్మికులకు సహాయం అందించేందుకు ఏర్పాటైన కరోనా క్రైసిస్ ఛారిటీ (సి సి సి) కు దర్శకుడు సంపత్ నంది 5 లక్షల రూపాయల విరాళాన్ని అందించనున్నట్లు ప్రకటించారు. ఇది ఎవరూ ఊహించని ఉపద్రవం అని, ఇలాంటి క్లిష్ట పరిస్థితిలో  సహాయం గా అందించే ప్రతి రూపాయి ఎంతో కీలకం అని తన వంతుగా 5 లక్షల రూపాయలు సహాయంగా అందిస్తున్నట్టు తెలిపారు. ప్రజలందరూ త‌మ ఇళ్ల‌కే ప‌రిమిత‌మై ఆరోగ్యాన్ని కాపాడుకోవాల‌నీ సంపత్ నంది కోరారు.