సిల్లీ ఫెల్లోస్ మూవీ రివ్యూ

Published On: September 7, 2018   |   Posted By:

సిల్లీ ఫెల్లోస్ మూవీ రివ్యూ

టైటిల్ : సిల్లీ ఫెల్లోస్
రిలీజ్ డేట్ : 07/09/2018
తారాగణం : అల్లరి నరేష్,సునీల్,నందిని,చిత్రా శుక్లా
దర్శకత్వం : భీమనేని శ్రీనివాస రావు
సంగీతం : శ్రీ విశాంత్
నిర్మాత : భరత్ రెడ్డి,కిరణ్ చౌదరి
సినిమాటోగ్రఫీ : అనీష్ తరుణ్ కుమార్
ఎడిటింగ్ :గౌతమ్ రాజు
నిడివి : 145 mnts
బ్యానర్ :బ్లూ ప్లానెట్ ఎంటర్టైన్మెంట్స్ అండ్ పీఫుల్ మీడియా ఫ్యాక్టరీ

కథ:
జాకెట్ జానికిరామ్ (జయప్రకాష్ రెడ్డి), పేరు మోసిన ఎం ఎల్ ఎ మేల్కొటి కి రైట్ హ్యాండ్. అతనికి అసిస్టెంట్ అల్లరి నేరేష్. నరేష్ కి బెస్ట్ ఫ్రెండు సునీల్. నరేష్ స్వతాహాగా బూరలు వండేసే టైపు. అదే పనిలో ఉంటూ ఓ సారి హీరోయిన్ (చిత్రా శుక్లా ), హీరోయిన్ అక్క (ఝాన్సీ) మద్ద పది లక్షలు డబ్బు తీసుకొని, నేను మీ పని ఎం ఎల్ ఎ తో చేపిస్తానని మాటిస్తాడు. అది తీసుకేళ్లి జానకిరామ్ చేతికిచ్చి ఎం ఎల్ ఎ తో పని జరిపించమని అంటాడు. సునీల్ తాను ప్రాణంగా ప్రేమించిన అమ్మాయి (నందిని) ని పెళ్లి చేసుకునే తరుణం లో, అనుకోకుండా వేరే పెళ్లి పందిట్లో వేరే అమ్మాయికి తాళి కడతాడు. నందిని సునీల్ ని అపార్ధం చేసుకుంటుంది. నేనిలా అవ్వడానికి కారణం ఎం ఎల్ ఎ అని, సునీల్ అలా చేయడం వెనుకాలా అతని తప్పేమి లేదని నందినికి చెప్పి ఒప్పించి నన్ను కాపాడమని సునీల్ జయప్రకాష్ ని ఆశ్రయిస్తాడు. ఈ తరుణంలో అనుకోకుండా జయప్రకాష్ కి ఒక ఆక్సిడెంట్ లో బ్రెయిన్ దొబ్బుతుంది. చిక్కుల్లో పడతారు నరేష్,సునీల్. దీనికి తోడు పోసాని, రాజారవీంద్ర లు జయప్రకాశ్ ని మట్టికరిపిద్దామని తెగ ప్రయత్నిస్తూ ఉంటారు. హీరోలిద్దరు చిక్కుల్లోంచి బయటపడ్డారా లేదా? పోసాని, రాజారవీంద్ర లు ఎందుకు జయప్రకాశ్ ని మట్టిగరిపిద్దాం అని అనుకుంటున్నారో తెలుసుకోవాలంటే సినిమా చోడాల్సిందే.

ప్లస్ పాయింట్స్ :
స్లాప్స్టిక్ కామిడి
మాటల రచయితగా మొదటిసారిగా భీమనేని విజయవంతం అవ్వడం
చిత్రా శుక్లా (అందం, పర్ఫామ్)
ఆర్టిస్టులు

మైనస్ పాయింట్స్ :
కంటెంట్ లేకపోవడం
సీరియస్ విలనిజం ఉన్న విషయాన్ని కామెడీగా చెప్పడం

బోట‌మ్ లైన్‌: సిల్లీ గా కాలక్షేపం కాసేపు

రేటింగ్ : 2.5/5