సీక్వెల్‌లో సాయిప‌ల్ల‌వి

Published On: April 25, 2018   |   Posted By:

సీక్వెల్‌లో సాయిప‌ల్ల‌వి

త‌మిళ అమ్మాయి అయిన‌ప్ప‌టికీ మల‌యాళ చిత్రం `ప్రేమ‌మ్‌`తో బ్రేక్ సంపాదించుకుంది. త‌ర్వాత తెలుగులో ఫిదా, ఎం.సి.ఎ చిత్రాల స‌క్సెస్‌తో మంచి పేరు సంపాదించుకుంది. త‌మిళంలో సూర్య‌తో సినిమా చేస్తోన్న సాయిప‌ల్ల‌వి.. `క‌ణం` సినిమాతో ఈ 27న అల‌రించ‌నుంది. సాయిప‌ల్ల‌వి మంచి ఎక్స్‌ప్రెసివ్ ఆర్టిస్టే కాదు… మంచి డాన్స‌ర్ కూడా. ఈమె డాన్స్ బాగా చేస్తుంద‌నే పేరు రావ‌డంతో.. నిర్మాత ల‌గ‌డ‌పాటి శ్రీధ‌ర్ ఆమెను ప్ర‌ధాన పాత్రధారిగా ఓ సినిమా ప్లాన్ చేస్తున్నాడు. ఆ సినిమా ఏదో కాదు.. `స్టైల్ 2`. గ‌తంలో లారెన్స్ హీరోగా ల‌గ‌డ‌పాటి శ్రీధ‌ర్ స్టైల్ సినిమాను నిర్మించాడు. డాన్స్ ప్ర‌ధానంగా సాగే ఈ సినిమాలో చిరంజీవి, నాగార్జున‌లు కూడా న‌టించారు. ఇప్పుడు డాన్స్ ప్ర‌ధానంగా `స్టైల్ 2` సినిమాలో న‌టిండ‌చానికి సాయిప‌ల్ల‌వి ఒప్పుకుంటుందో లేదో చూడాలి.