సీనియ‌ర్ హీరోయిన్ కుమారుడి సినీ ఎంట్రీ

Published On: December 13, 2017   |   Posted By:

సీనియ‌ర్ హీరోయిన్ కుమారుడి సినీ ఎంట్రీ

చిరంజీవితో ప‌సివాడి ప్రాణం, రాక్షసుడు ఇలా ప‌లు చిత్రాల‌తో పాటు..ప‌లువురు అగ్ర హీరోల స‌ర‌స‌న న‌టించిన సుమ‌ల‌త అందరికీ గుర్తుండే ఉంటుంది. ఈమె క‌న్న‌డ న‌టుడు అంబ‌రీష్‌ను పెళ్లి చేసుకుని స్థిర‌ప‌డింది. అంబ‌రీష్ మంచి న‌టుడే కాదు..రాజ‌కీయ నాయ‌కుడు కూడా. ఇప్పుడు వీరి కుమారుడు అభిషేక్ త్వ‌ర‌లోనే సినీ ఎంట్రీకి సిద్ధ‌మవుతున్నాడు. త‌న సినీ ఎంట్రీకి సంబంధించి అభిషేక్ న‌ట‌న‌, డ్యాన్సులు త‌దిత‌ర అంశాల్లో శిక్ష‌ణ కూడా తీసుకున్నాడట‌. ప‌వ‌న్ వ‌డియార్ లేదా చేత‌న్ కుమార్ సినిమాను డైరెక్ట్ చేస్తార‌ని, సందేశ్ నాగ‌రాజ్ సినిమాను నిర్మిస్తాడ‌ని టాక్‌. మంచి న‌టుడి కుమారుడిగా అభిషేక్ ఎంట్రీపై స‌ర్వ‌త్రా ఆస‌క్తి నెల‌కొని ఉంది.