సీరత్ కపూర్ ఇంటర్వ్యూ

Published On: October 11, 2017   |   Posted By:

సీరత్ కపూర్ ఇంటర్వ్యూ

రాజుగారి గది-2 సినిమాతో మరోసారి తెలుగుతెరపై అదృష్టాన్ని పరీక్షించుకుంటోంది హాట్ బ్యూటీ సీరత్ కపూర్. ఈ సినిమాతో కచ్చితంగా స్టార్ హీరోయిన్ రేసులోకి ఎంటర్ అవుతానని అంటోంది. సినిమా విశేషాలతో పాటు తన కెరీర్ కు సంబంధించిన మరిన్ని డీటెయిల్స్ ను మీడియాతో పంచుకుంది.

రాజుగారి గది-2లో నా క్యారెక్టర్..

సినిమాలో నా పాత్ర గురించి ఇప్పుడే ఎక్కువగా చెప్పడం కుదరదు. సినిమాలో నా క్యారెక్టర్ చాలా నేచురల్ గా ఉంటుంది. బయట నేను ఎలా ఉంటానో ఇందులో కూడా అంతే క్యాజువల్ గా కనిపించాను. ఇక సినిమా విషయానికొస్తే.. ఈ స్క్రిప్ట్ చాలా బాగుంది. ఈ సినిమా ఛాన్స్ రావడం నిజంగా నా అదృష్టం.

అనుకోకుండా వచ్చిన ఆఫర్

ఈ స్క్రిప్ట్ చూసిన తర్వాత ఎవరో నా పేరు సూచించారట. రన్ రాజా రన్ చూసిన తర్వాత ఓంకార్ నన్ను కలిసి ఈ ఛాన్స్ ఇచ్చారు. నేను ఎలాంటి ప్రయత్నాలు చేయకుండా నాకొచ్చిన ఓ మంచి అవకాశం ఇది. మరీ ముఖ్యంగా నాగ్ సర్ తో కలిసి నటించడం నా అదృష్టం.

ఓంకార్ వర్కింగ్ స్టయిల్ బాగుంటుంది

ఓంకార్ చాలా మంచి వ్యక్తి. ఎక్కువగా మాట్లాడడు. సెట్స్ లో తనకు ఏం కావాలో అది చెప్పి రాబట్టుకుంటాడు. మేల్, ఫిమేల్ యాక్టర్స్ ను ఒకేలా చూసే దర్శకుడు ఓంకార్. కథ, స్క్రీన్ ప్లే లో మాత్రమే కాకుండా.. రియల్ లైఫ్ లో కూడా ఓంకార్ చాలా క్లియర్ గా ఉంటాడు. రాజుగారి గది-2 సినిమా స్క్రిప్ట్ చాలా బాగుంది.

ఒరిజినల్ వెర్షన్ చూడలేదు

రాజుగారి గది-2 ఒరిజినల్ వెర్షన్ నేను చూడలేదు. నా స్టయిల్ లో నేను చేసుకుంటూ వెళ్లిపోయాను. నాగార్జున, నాకు మధ్య కాంబినేషన్ సీన్లు చాలా ఉన్నాయి. నాగ్ తో నటించడం చాలా కంఫర్టబుల్ గా ఉంటుంది. పెద్ద స్టార్ అయినప్పటికీ నాగ్ నడుచుకునే విధానం చాలా బాగుంది. నాగ్ ను చూసి చాలా నేర్చుకోవచ్చు. మొదటి రోజే నాగార్జున చాలా క్లోజ్ అయిపోయారు. పరిశ్రమ గురించి, సినిమాలో పాత్రల గురించి నేను, నాగ్ చాలా మాట్లాడుకునేవాళ్లం. నాగ్ తో నటించాలనే నా కోరిక రాజుగారి గది-2తో తీరింది.

సినిమాలో ప్రతి పాత్ర కీలకమే

సినిమాలో ప్రతి పాత్రకు ప్రాముఖ్యం ఉంటుంది. ఎవర్నీ తక్కువ చేయడానికి లేదు. ఓంకార్ ఆ విధంగా స్క్రిప్ట్ రాసుకున్నారు. సినిమాలో ప్రతి పాత్ర కీలకమే. నేను తెలుగు సినిమాలకు పెద్దగా ఇంపార్టెన్స్ ఇవ్వనని అంతా అనుకుంటున్నారు. అలాంటిదేం లేదు. మంచి పాత్రలు దొరికితే తెలుగులో నటించడానికి ఎప్పుడూ సిద్ధమే. కాకపోతే మధ్యమధ్యలో ఇతర భాషల్లో కూడా సినిమాలు చేస్తున్నాను. టాలీవుడ్ అంటే నాకు ఎప్పటికీ గౌరవమే.

కొలంబస్ ఫ్లాప్ పై…

కొలంబస్ ఎక్స్ పెక్ట్ చేసిన రేంజ్ లో సక్సెస్ కాలేదు. కానీ ఆ సినిమా విషయంలో ఇప్పటికీ రిగ్రేట్స్ లేవు. ఇప్పటికీ ఆ సినిమాలో నేను ప్లే చేసిన నీరు క్యారెక్టర్ కి క్రిటిక్స్ నుండి కూడా మంచి అప్రీసియేషన్స్ దొరికాయి. సో ఫ్లాప్స్, సక్సెస్ చాలా కామన్, కొత్త విషయాలు నేర్చుకుంటూ మూవ్ ఆన్ అవ్వడాన్నే నేను నమ్ముతాను.

డబ్బింగ్ చెప్పుకునేంత స్థాయి రాలేదు

తెలుగులో డబ్బింగ్ చెప్పుకునేంత స్థాయికి నాకింకా రాలేదు. తెలుగులో సినిమాలైతే చేస్తున్నాను కానీ డబ్బింగ్ మాత్రం ఇంకా చెప్పుకోలేదు. భవిష్యత్తులో చెప్పుకుంటానేమో తెలీదు. ప్రస్తుతం V.I. ఆనంద్ డైరెక్షన్ లో అల్లు శిరీష్ హీరోగా సినిమా చేస్తున్నాను. దాంతో పాటు దగ్గుబాటి రానా ప్రొడక్షన్ లో రవికాంత్ పేరేపు డైరెక్షన్ లో సినిమాతో పాటు, రవితేజ టచ్ చేసి చూడు సినిమాల్లో నటిస్తున్నాను. వీఐ ఆనంద్ సినిమా 80శాతం కంప్లీట్ అయింది.

నన్ను వేరే కోణంలో చూస్తున్నారు

సోషల్ మీడియాలో నా ఫోటోషూట్స్ వెనుక ఒక బలమైన కాన్సెప్ట్ ఉంది. డిజైనర్ మంచి ఉద్దేశంతో ఆ షూట్ చేశారు. ఆ ఫోటోల్లోని నా ముఖంలో మహిళ ఎంత బలంగా ఉండగలదో చెప్పే ఫీలింగ్స్ కనిపిస్తాయి. అది కొంతమందికి మాత్రమే అర్థమైంది. కానీ చాలామంది నా ఎక్స్ ప్రెషన్స్ కంటే నా ఎక్స్ పోజింగ్ నే ఎక్కువ చూశారు. నా స్కిన్ టోన్ అందర్నీ ఎట్రాక్ట్ చేసింది. ప్రతి విమర్శను నేను పాజిటివ్ గా తీసుకుంటాను.