సుకుమార్‌తో మ‌రోసారి మ‌హేష్‌బాబు

Published On: January 16, 2018   |   Posted By:
సుకుమార్‌తో మ‌రోసారి మ‌హేష్‌బాబు
డిఫ‌రెంట్ కాన్సెప్ట్ సినిమాల‌ను తెర‌కెక్కించ‌డంలో సుకుమార్ దిట్ట‌. ప్ర‌స్తుతం రామ్‌చ‌ర‌ణ్ తేజ్‌తో `రంగ‌స్థ‌లం` సినిమాను డైరెక్ట్ చేస్తున్నాడు సుకుమార్‌. ఈ సినిమా మార్చి 30న విడుద‌ల కానుంది. ఈ సినిమా త‌ర్వాత సుకుమార్ ఏ హీరోతో సినిమా చేస్తాడ‌నే దానిపై ఇంకా క్లారిటీ రాలేదు. అయితే ఇండ‌స్ట్రీ వ‌ర్గాల స‌మాచారం ప్ర‌కారం సుకుమార్‌… సూప‌ర్‌స్టార్ మ‌హేష్‌బాబుతో సినిమా చేస్తాడ‌ట‌. గ‌తంలో మ‌హేష్‌, సుకుమార్ కాంబినేష‌న్‌లో `నేనొక్క‌డినే` సినిమా తెరకెక్కింది. ఆ సినిమా ప్లాప్ అయ్యింది. ఒక‌వేళ అన్నీ అనుకున్న‌ట్లుగా జ‌రిగితే సుకుమార్‌తో మ‌హేష్‌తో సుకుమార్ సినిమా ఉంటుందంటున్నారు.